మోనాన నుందాన వేమే ముని వైతివా
(॥పల్లవి॥)
మోనాన నుందాన వేమే ముని వైతివా
మేనులు సోఁకిన మందెమేళ మైన లేదా
(॥మోనాన॥)
అలిగితే నే మాయ అట్టె వూరకుండ నేల
పలుకుల నైనఁ దూరఁ బాడి గాదా
మలయుచుఁ బోట్లాడే మాసటీలు సయితము
అలరి పగలు చాటే రది యైన లేదా
(॥మోనాన॥)
రా కుండితే నే మాయ రతి నాపై నెరపి
దాకొని చెప్పంప నైనఁ దగవు గాదా
కాకుగాఁ గొట్లాడేటి కడవారు సయితము
ఆకడఁ జేతులు చాఁతు రదియూ లేదా
(॥మోనాన॥)
పంత మైతే నే మాయ పైకొని నే వేఁడుకోగా
అంతట కోపము దీర నైనఁ జెల్లదా
వింతగా శ్రీవెంకటాద్రివిభుఁడ నింతే నేను
యింతలో నన్నుఁ గూడితి యెర వింత లేదా
(||pallavi||)
monāna nuṁdāna veme muni vaidivā
menulu som̐kina maṁdĕmeḽa maina ledā
(||monāna||)
aligide ne māya aṭṭĕ vūraguṁḍa nela
palugula nainam̐ dūram̐ bāḍi gādā
malayusum̐ boṭlāḍe māsaḍīlu sayidamu
alari pagalu sāḍe radi yaina ledā
(||monāna||)
rā kuṁḍide ne māya radi nābai nĕrabi
dāgŏni sĕppaṁpa nainam̐ dagavu gādā
kāgugām̐ gŏṭlāḍeḍi kaḍavāru sayidamu
āgaḍam̐ jedulu sām̐tu radiyū ledā
(||monāna||)
paṁta maide ne māya paigŏni ne vem̐ḍugogā
aṁtaḍa kobamu dīra nainam̐ jĕlladā
viṁtagā śhrīvĕṁkaḍādrivibhum̐ḍa niṁte nenu
yiṁtalo nannum̐ gūḍidi yĕra viṁta ledā