Monaana noorage neegu mokkem gaaga

మోనాన నూరకె నీకు మొక్కేఁ గాక
Language

(॥పల్లవి॥)
మోనాన నూరకె నీకు మొక్కేఁ గాక
కానికలు సారె నేమి కప్ప మంపే నీకును

(॥మోనాన॥)
తలఁపు నామీఁద నీకు తగిలి వుండఁగాను
చెలు లేమి విన్నపాలు సేసేరు నీకు
చలిమి బమిలి నాకు సరి గలిగి యుండఁగ
మలసి సొలసి యేమి మాటలాడే నిన్నును

(॥మోనాన॥)
మంతనాన నీవు నాకు మనసిచ్చి యండఁగాను
దొంతులబుద్దులు యేమి దోఁచీ నీకు
పంత మిచ్చి నీవు నాపై పక్షమై యుండఁగాను
కొంత గొంత యిఁక నేమి గొసరేము నిన్నును

(॥మోనాన॥)
కందువల నీవు నన్నుఁ గాఁగిలించు కుండఁగాను
విందుల నాగుణములు వింతా నీకు
పొందుగ శ్రీవెంకటేశ పూఁచి నన్నుఁ గలసితి
చందముగా యిఁక నేమి జరసేము నిన్నును

(||pallavi||)
monāna nūragĕ nīgu mŏkkem̐ gāga
kānigalu sārĕ nemi kappa maṁpe nīgunu

(||monāna||)
talam̐pu nāmīm̐da nīgu tagili vuṁḍam̐gānu
sĕlu lemi vinnabālu seseru nīgu
salimi bamili nāgu sari galigi yuṁḍam̐ga
malasi sŏlasi yemi māḍalāḍe ninnunu

(||monāna||)
maṁtanāna nīvu nāgu manasichchi yaṁḍam̐gānu
dŏṁtulabuddulu yemi dom̐sī nīgu
paṁta michchi nīvu nābai pakṣhamai yuṁḍam̐gānu
kŏṁta gŏṁta yim̐ka nemi gŏsaremu ninnunu

(||monāna||)
kaṁduvala nīvu nannum̐ gām̐giliṁchu kuṁḍam̐gānu
viṁdula nāguṇamulu viṁtā nīgu
pŏṁduga śhrīvĕṁkaḍeśha pūm̐si nannum̐ galasidi
saṁdamugā yim̐ka nemi jarasemu ninnunu