Momudo momuloni kalalave muchchadalu mimchenave

మోముతో మోములోని కళలవే ముచ్చటలు మించెనవే
Language

(॥పల్లవి॥)
మోముతో మోములోని కళలవే ముచ్చటలు మించెనవే
కామిని గోరినయట్టే కలుగఁగఁ బోఁలును

(॥వెము॥)
కన్నుల లేనవ్వులవే గజరుఁబులకలవే
కన్నెకు విభునిపొందు గలుగఁబోలు
సన్నపుఁజెమటలవే సరుల చెదురులవే
చిన్నలతోడి రతులు చేకొనఁగఁ బోలును

(॥వెము॥)
నిట్టూరుపుగములవే నెరులు జారినవవే
ఇట్టె పతికడకుఁ దానేఁగఁ బోలును
తెట్టెలైన సిగ్గులవే తేలింపుఁ గన్నులవే
వొట్టిన మరుముద్రలు వొళ్లనుండఁ బోలును

(॥వెము॥)
బడలికనడపదే పయ్యదజారులవే
పడఁతి శ్రీవేంకటేశుఁ బైకొనఁబోలు
యెడయని సంతసము లిద్దరికి ముంచెనవే
జడిగొన్న కూటములు సతము గాఁబోలును

(||pallavi||)
momudo momuloni kaḽalave muchchaḍalu miṁchĕnave
kāmini gorinayaṭṭe kalugam̐gam̐ bom̐lunu

(||vĕmu||)
kannula lenavvulave gajarum̐bulagalave
kannĕgu vibhunibŏṁdu galugam̐bolu
sannabum̐jĕmaḍalave sarula sĕdurulave
sinnaladoḍi radulu segŏnam̐gam̐ bolunu

(||vĕmu||)
niṭṭūrubugamulave nĕrulu jārinavave
iṭṭĕ padigaḍagum̐ dānem̐gam̐ bolunu
tĕṭṭĕlaina siggulave teliṁpum̐ gannulave
vŏṭṭina marumudralu vŏḽlanuṁḍam̐ bolunu

(||vĕmu||)
baḍaliganaḍabade payyadajārulave
paḍam̐ti śhrīveṁkaḍeśhum̐ baigŏnam̐bolu
yĕḍayani saṁtasamu liddarigi muṁchĕnave
jaḍigŏnna kūḍamulu sadamu gām̐bolunu