Mokkidinani seppare modalane tanagunu

మొక్కితినని చెప్పరే మొదలనే తనకును
Language

(॥పల్లవి॥)
మొక్కితినని చెప్పరే మొదలనే తనకును
చెక్కుచేతితోడఁ దన సేవ సేసేవారము

(॥॥)
జగడాలు దీరు మని సారె సారె మిమ్ము నంపె
మగవారికి బలువా మగువలమూ
బిగిసేవారమా తన ప్రియములోవారము
తగిలితే మరిఁ దన దయ లోని వారము

(॥॥)
వేమరు నల్లంతనుండి విరుల నేల వేసీనే
కామునమ్ముల కెక్కుడా కాంతలమూ
రా మనేటివారమా రతిలోని వారము
ఆమీఁదటి పనులకు నఱచేతి వారమూ

(॥॥)
చలము సాదించి తాను సారెఁ బైఁ జేయి వేసి
వలపులకు వేళా వనితలమూ
అలరి శ్రీ వేంకటేశుఁ డట్టే నన్నుఁ గూడె నిదె
మలసితే నింకాఁ దన మనసులోవారమూ.

(||pallavi||)
mŏkkidinani sĕppare mŏdalane tanagunu
sĕkkusedidoḍam̐ dana seva sesevāramu

(||||)
jagaḍālu dīru mani sārĕ sārĕ mimmu naṁpĕ
magavārigi baluvā maguvalamū
bigisevāramā tana priyamulovāramu
tagilide marim̐ dana daya loni vāramu

(||||)
vemaru nallaṁtanuṁḍi virula nela vesīne
kāmunammula kĕkkuḍā kāṁtalamū
rā maneḍivāramā radiloni vāramu
āmīm̐daḍi panulagu naṟasedi vāramū

(||||)
salamu sādiṁchi tānu sārĕm̐ baim̐ jeyi vesi
valabulagu veḽā vanidalamū
alari śhrī veṁkaḍeśhum̐ ḍaṭṭe nannum̐ gūḍĕ nidĕ
malaside niṁkām̐ dana manasulovāramū.