మొక్కితి ననవే తన మొక్కలపు చేఁతలకు
(॥పల్లవి॥)
మొక్కితి ననవే తన మొక్కలపు చేఁతలకు
దిక్కుల నెంతేసి తరితీపులఁ బెట్టీని
(॥॥)
తగవులన్నియునుఁ దనచేతనే వింటి
యెగసక్కేలెల్లా నిఁక నేలాడీనే
నగిన తన నవ్వులు నాఁటె నా మనసులోన
పగటునఁ దనచేత పంతము గొనేనా
(॥॥)
అందికలుఁ బొందికలు నప్పుడే నేఁ గనుఁగొంటి
యిందులో తనపై నింద లేల మోపీనే
అందపుఁ దన సరసా లలవాటే నాకుఁ దొల్లి
మందెమేలమున నిఁక మంకులు చూపేనా
(॥॥)
ననుపులు మన్ననలు నాకు నేఁడే తానొసఁగె
యెనలేక వలచితి నేల దూరేనే
ఘన శ్రీవేంకటేశుఁడు కాఁగిలించి ననుఁ గూడె
పనివడి యిఁక వేరే పట్టి పెనఁగేనా
(||pallavi||)
mŏkkidi nanave tana mŏkkalabu sem̐talagu
dikkula nĕṁtesi taridībulam̐ bĕṭṭīni
(||||)
tagavulanniyunum̐ danasedane viṁṭi
yĕgasakkelĕllā nim̐ka nelāḍīne
nagina tana navvulu nām̐ṭĕ nā manasulona
pagaḍunam̐ danaseda paṁtamu gŏnenā
(||||)
aṁdigalum̐ bŏṁdigalu nappuḍe nem̐ ganum̐gŏṁṭi
yiṁdulo tanabai niṁda lela mobīne
aṁdabum̐ dana sarasā lalavāḍe nāgum̐ dŏlli
maṁdĕmelamuna nim̐ka maṁkulu sūbenā
(||||)
nanubulu mannanalu nāgu nem̐ḍe tānŏsam̐gĕ
yĕnalega valasidi nela dūrene
ghana śhrīveṁkaḍeśhum̐ḍu kām̐giliṁchi nanum̐ gūḍĕ
panivaḍi yim̐ka vere paṭṭi pĕnam̐genā