మొక్కేరా నీకంటే ముందుముందే
(॥పల్లవి॥)
మొక్కేరా నీకంటే ముందుముందే
కక్కూరి తింతయేల కాఁకలఁ బెట్టకురా
(॥మొక్కే॥)
నీటిలోని ముల్లువంటి నీగుణము దెలియ
యేఁటవెట్టి హెచ్చుకుందు లెంచనోప
యేఁటికి గొరసెరాయ డెందుఁ బొందనివేళ
ఆఁటదాన నింతే నన్నారడిసేయకురా
(॥మొక్కే॥)
వేవేలుఁ జేసి నీకు వేఁడుకొనేదే గుణము
ఆవల నలిగితే మారలుగనోప
వావిదప్ప కంత నీపు వల్లెవేసే వెందునైనా
పూవువంటిదాన నింతే బూకలు సేయకురా
(॥మొక్కే॥)
మానుమాను మిఁకనైనా మాతోడిచలములు
కేనముతో రాయి గిలిగించ నేనోప
యీనెపాన శ్రీవేంకటేశ నన్నుఁ గూడితివి
ఆనిపట్టి నన్ను నింత అలయింపించకురా
(||pallavi||)
mŏkkerā nīgaṁṭe muṁdumuṁde
kakkūri tiṁtayela kām̐kalam̐ bĕṭṭagurā
(||mŏkke||)
nīḍiloni mulluvaṁṭi nīguṇamu dĕliya
yem̐ṭavĕṭṭi hĕchchuguṁdu lĕṁchanoba
yem̐ṭigi gŏrasĕrāya ḍĕṁdum̐ bŏṁdaniveḽa
ām̐ṭadāna niṁte nannāraḍiseyagurā
(||mŏkke||)
vevelum̐ jesi nīgu vem̐ḍugŏnede guṇamu
āvala naligide māraluganoba
vāvidappa kaṁta nību vallĕvese vĕṁdunainā
pūvuvaṁṭidāna niṁte būgalu seyagurā
(||mŏkke||)
mānumānu mim̐kanainā mādoḍisalamulu
kenamudo rāyi giligiṁcha nenoba
yīnĕbāna śhrīveṁkaḍeśha nannum̐ gūḍidivi
ānibaṭṭi nannu niṁta alayiṁpiṁchagurā