Mokkemu neegu nide mogim badivelu vachche

మొక్కేము నీకు నిదె మొగిఁ బదివేలు వచ్చె
Language

(॥పల్లవి॥)
మొక్కేము నీకు నిదె మొగిఁ బదివేలు వచ్చె
చక్కఁజూచి నీవు నాకుఁ జనవీయరాదా

(॥మొక్కే॥)
కోపగించకుమీ నీవు గొబ్బున నేఁ బోతినంటా
యీపొద్దుదాఁకా నుండి యేమి సేతును
మాపుదాఁకా నిందరితో మాటలాడ నీకుఁబట్టె
చేపట్టి నీవు నన్నుఁ జేకొనుట యెపుడో

(॥మొక్కే॥)
పెనఁగకుమీ నాతో బిగిసివుందాననంటా
యినుమడించెను గాఁక లేమి సేతును
చనవరులతో నీకు సరసమాడనే పట్టె
తనివోనినావొళ్లఁ దప్పులేదు సుమీ

(॥మొక్కే॥)
పిదపఁ జింతించకుమీ బీరానఁ దెగితినంటా
యెదురు చూచలసితి నేమి సేతును
యిదివొ శ్రీవేంకటేశ యిట్టె నన్నుఁ గూడితివి
కదిసిన మీఁద మరి కలదా తాలిములు

(||pallavi||)
mŏkkemu nīgu nidĕ mŏgim̐ badivelu vachchĕ
sakkam̐jūsi nīvu nāgum̐ janavīyarādā

(||mŏkke||)
kobagiṁchagumī nīvu gŏbbuna nem̐ bodinaṁṭā
yībŏddudām̐kā nuṁḍi yemi sedunu
mābudām̐kā niṁdarido māḍalāḍa nīgum̐baṭṭĕ
sebaṭṭi nīvu nannum̐ jegŏnuḍa yĕbuḍo

(||mŏkke||)
pĕnam̐gagumī nādo bigisivuṁdānanaṁṭā
yinumaḍiṁchĕnu gām̐ka lemi sedunu
sanavarulado nīgu sarasamāḍane paṭṭĕ
tanivonināvŏḽlam̐ dappuledu sumī

(||mŏkke||)
pidabam̐ jiṁtiṁchagumī bīrānam̐ dĕgidinaṁṭā
yĕduru sūsalasidi nemi sedunu
yidivŏ śhrīveṁkaḍeśha yiṭṭĕ nannum̐ gūḍidivi
kadisina mīm̐da mari kaladā tālimulu