మొక్కేము నీకు నీ మోహము గల్ల లంటీనా
(॥పల్లవి॥)
మొక్కేము నీకు నీ మోహము గల్ల లంటీనా
యెక్కడి సాకిరులు నే నెఱగనా నిన్ను
(॥మొక్కే॥)
మాటలు నీ వెన్నాడినా మచ్చి కెంత సేసినాను
నీటునఁ దొల్లిటిదే కా నీగుణము
వాఁట మాయ వలపులు వావులూనుఁదుఁద కెక్కె
యేటికి బెట్టే వానలు యెఱగనా నేను
(॥మొక్కే॥)
చెక్కులిట్టె నొక్కినాను చేరి యంత నవ్వి నాను
నిక్కి నేఁ జూచినవే కా నీ చేఁతలు
దిక్కులవా రెరిఁగిరి దీవెనలు సరివచ్చె
యిక్కువ లేలంటేవు యెఱఁగనా నేను
(॥మొక్కే॥)
కన్కుల నెంత చూచినా కాగి లెంత యిచ్చినాను
నిన్నటి మొన్నటివే కా నీవినయాలు
నన్ను శ్రీ వేంకటేశుఁడ నటనలఁ గూడితివి
యెన్నసిమన్నన లిచ్చె వెఱఁగనా నేను
(||pallavi||)
mŏkkemu nīgu nī mohamu galla laṁṭīnā
yĕkkaḍi sāgirulu ne nĕṟaganā ninnu
(||mŏkke||)
māḍalu nī vĕnnāḍinā machchi kĕṁta sesinānu
nīḍunam̐ dŏlliḍide kā nīguṇamu
vām̐ṭa māya valabulu vāvulūnum̐dum̐da kĕkkĕ
yeḍigi bĕṭṭe vānalu yĕṟaganā nenu
(||mŏkke||)
sĕkkuliṭṭĕ nŏkkinānu seri yaṁta navvi nānu
nikki nem̐ jūsinave kā nī sem̐talu
dikkulavā rĕrim̐giri dīvĕnalu sarivachchĕ
yikkuva lelaṁṭevu yĕṟam̐ganā nenu
(||mŏkke||)
kankula nĕṁta sūsinā kāgi lĕṁta yichchinānu
ninnaḍi mŏnnaḍive kā nīvinayālu
nannu śhrī veṁkaḍeśhum̐ḍa naḍanalam̐ gūḍidivi
yĕnnasimannana lichchĕ vĕṟam̐ganā nenu