Mokkemayyaa neegu mummaadigi

మొక్కేమయ్యా నీకు ముమ్మాటికి
Language

(॥పల్లవి॥)
మొక్కేమయ్యా నీకు ముమ్మాటికి
యెక్కువతక్కువల నిన్నేమి సేసితిమో

(॥మొక్కే॥)
విరహతాపము చేత విసిగిన వేళ నిన్ను
యెరవుగా జూచి చూచి యే మాడితినో
తరలక నీవు నన్ను దగ్గరి కాగిలించితే
కరఁగినవేళ యెట్టు కాలు చేయి దాఁకునో

(॥మొక్కే॥)
జవ్వన మదము చేత జడిసిన వేళ నిన్ను
యివ్వల నే నెంత రచ్చ కెక్కించితినో
నవ్వుతా నీవంత నాకు నీమో వియ్యఁగాను
యెవ్వల నీకేడేడ నా యెంగి లాయనో

(॥మొక్కే॥)
పానుపు పై నిద్దరము పవ్వ ళించే వేళ నిన్ను
పూని యంత యలయించి భోగించితినో
ఆనుక శ్రీవేంకటేశ అలమేలుమంగను న
న్నీ నెపానఁ గూడితివి యెట్లా మీరితినో

(||pallavi||)
mŏkkemayyā nīgu mummāḍigi
yĕkkuvadakkuvala ninnemi sesidimo

(||mŏkke||)
virahadābamu seda visigina veḽa ninnu
yĕravugā jūsi sūsi ye māḍidino
taralaga nīvu nannu daggari kāgiliṁchide
karam̐ginaveḽa yĕṭṭu kālu seyi dām̐kuno

(||mŏkke||)
javvana madamu seda jaḍisina veḽa ninnu
yivvala ne nĕṁta rachcha kĕkkiṁchidino
navvudā nīvaṁta nāgu nīmo viyyam̐gānu
yĕvvala nīgeḍeḍa nā yĕṁgi lāyano

(||mŏkke||)
pānubu pai niddaramu pavva ḽiṁche veḽa ninnu
pūni yaṁta yalayiṁchi bhogiṁchidino
ānuga śhrīveṁkaḍeśha alamelumaṁganu na
nnī nĕbānam̐ gūḍidivi yĕṭlā mīridino