మొక్కే నిదివో నేను ముమ్మాటికి
(॥పల్లవి॥)
మొక్కే నిదివో నేను ముమ్మాటికి
నిక్కము నీ ప్రియములే నెరపుమీ విభుఁడ
(॥॥)
యెఱుకగలవాఁడవు యెవ్వరు బత్తిసేసినా
మఱవ వందరి నిట్టె మన్నింతువు
జఱసి నిన్ను నెంత చండిపరచితినో
యెఱఁగనైతి నాతప్పు లెంచకుమీ విభుఁడ
(॥॥)
ఇచ్చకమే ఆడుదువు యేసతితోనై నాను
పచ్చిదేర నవ్వుదువు పంతమిత్తువు
కొచ్చి కొచ్చి నే నెంత కుచముల నొత్తితినో
మచ్చరపుచేఁత లిఁక మానుమీ విభుఁడ
(॥॥)
కడు మెచ్చనేరుతువు కదిసినవారిని
విడువక చనవిచ్చి వెలయింతువు
యెడయక నిన్ను రతి నెంత బడలించితినో
కడఁగి యేలుమీ శ్రీ వేంకటగిరివిభుఁడ
(||pallavi||)
mŏkke nidivo nenu mummāḍigi
nikkamu nī priyamule nĕrabumī vibhum̐ḍa
(||||)
yĕṟugagalavām̐ḍavu yĕvvaru battisesinā
maṟava vaṁdari niṭṭĕ manniṁtuvu
jaṟasi ninnu nĕṁta saṁḍibarasidino
yĕṟam̐ganaidi nādappu lĕṁchagumī vibhum̐ḍa
(||||)
ichchagame āḍuduvu yesadidonai nānu
pachchidera navvuduvu paṁtamittuvu
kŏchchi kŏchchi ne nĕṁta kusamula nŏttidino
machcharabusem̐ta lim̐ka mānumī vibhum̐ḍa
(||||)
kaḍu mĕchchaneruduvu kadisinavārini
viḍuvaga sanavichchi vĕlayiṁtuvu
yĕḍayaga ninnu radi nĕṁta baḍaliṁchidino
kaḍam̐gi yelumī śhrī veṁkaḍagirivibhum̐ḍa