Mokke nidivo neegu mumdu mumde vatti

మొక్కే నిదివో నీకు ముందు ముందే వట్టి
Language

(॥పల్లవి॥)
మొక్కే నిదివో నీకు ముందు ముందే వట్టి-
లెక్కలెల్లా నెంచుకోక లేవరాదా

(॥మొక్కే॥)
పలుకులెల్లా వింటి భావములెల్లాఁ గంటి
చలము నాలోఁదీరదు సటలేలా
నిలుచున్నాఁడ విదివో నీవు వచ్చి తడవాయ
పొలసి యెందు వోయేవో పోయి రారాదా

(॥మొక్కే॥)
మనసెల్లాఁ దెలిసితి మంతనాలఁ దనిసితి
నిను నేమీ ననఁజాల నెగు లేలా
పనులు నీకుఁ గలవు పడఁతులు విలిచేరు
నను పెక్కడ నున్నదో నవ్వి రారాదా

(॥మొక్కే॥)
కాయమెల్లా నొరసితి కాఁగిటను గలసితి
పాయపు శ్రీవేంకటేశ బాస లింకేల
నాయము నీ వెరుఁగుదు నాకు సరి గలరేమో
ఆయెడ నెవ్వరినైనా నడిగి రారాదా

(||pallavi||)
mŏkke nidivo nīgu muṁdu muṁde vaṭṭi-
lĕkkalĕllā nĕṁchugoga levarādā

(||mŏkke||)
palugulĕllā viṁṭi bhāvamulĕllām̐ gaṁṭi
salamu nālom̐dīradu saḍalelā
nilusunnām̐ḍa vidivo nīvu vachchi taḍavāya
pŏlasi yĕṁdu voyevo poyi rārādā

(||mŏkke||)
manasĕllām̐ dĕlisidi maṁtanālam̐ danisidi
ninu nemī nanam̐jāla nĕgu lelā
panulu nīgum̐ galavu paḍam̐tulu viliseru
nanu pĕkkaḍa nunnado navvi rārādā

(||mŏkke||)
kāyamĕllā nŏrasidi kām̐giḍanu galasidi
pāyabu śhrīveṁkaḍeśha bāsa liṁkela
nāyamu nī vĕrum̐gudu nāgu sari galaremo
āyĕḍa nĕvvarinainā naḍigi rārādā