Mokke mee vubagaaramunagu memu neegu

మొక్కే మీ వుపకారమునకు మేము నీకు
Language

(॥పల్లవి॥)
మొక్కే మీ వుపకారమునకు మేము నీకు
ఇక్కువకు చూపితివి యేమి గొరతయ్యా

(॥మొక్కే॥)
పడఁతుల గర్వములు పతి యాదరించినంతా
జడియని నవ్వు సరసములంతాను
మడుపు మాట పలుకు మందె మేళములయంతా
యెడమిచ్చినాఁడవు మా కేమి గొరతయ్యా

(॥మొక్కే॥)
సతమైన రాజసము చనవు లిచ్చినయంతా
రతులలో నేరుపులు రమించెనంతా
ప్రతిలేని వలపులు భావించుకొన్నంతా
ఇతవుగా మా కిచ్చితి వేమిగొరతయ్యా

(॥మొక్కే॥)
మోవితేనియ విందులు ముంచి యాస గలయంతా
చేవమీరిన పనులు సేసినంతాను
శ్రీ వేంకటేశ నన్నుఁ జేకొని కూడితి విట్టె
యీవల నా మన్ననల కేమి గొరతయ్యా

(||pallavi||)
mŏkke mī vubagāramunagu memu nīgu
ikkuvagu sūbidivi yemi gŏradayyā

(||mŏkke||)
paḍam̐tula garvamulu padi yādariṁchinaṁtā
jaḍiyani navvu sarasamulaṁtānu
maḍubu māḍa palugu maṁdĕ meḽamulayaṁtā
yĕḍamichchinām̐ḍavu mā kemi gŏradayyā

(||mŏkke||)
sadamaina rājasamu sanavu lichchinayaṁtā
radulalo nerubulu ramiṁchĕnaṁtā
pradileni valabulu bhāviṁchugŏnnaṁtā
idavugā mā kichchidi vemigŏradayyā

(||mŏkke||)
movideniya viṁdulu muṁchi yāsa galayaṁtā
sevamīrina panulu sesinaṁtānu
śhrī veṁkaḍeśha nannum̐ jegŏni kūḍidi viṭṭĕ
yīvala nā mannanala kemi gŏradayyā