Mokke levayya nee vela musumgu vettugomtivi

మొక్కే లేవయ్య నీ వేల ముసుఁగు వెట్టుకొంటివి
Language

(॥పల్లవి॥)
మొక్కే లేవయ్య నీ వేల ముసుఁగు వెట్టుకొంటివి
చిక్కించి యాపె నంటేను చింత గాదా నీకును

(॥మొక్కే॥)
యెంత కెంత చూడవో నే నెదురాడ వచ్చునా
జంతలైన నీ మోహపు సతుల తోడ
పంతాన వారు వరచే పాట్లనే పడే నీకు
సంతోసము సేయనైతి చాలు నాదే నేరమీ

(॥మొక్కే॥)
అయ్యయ్యా పాపము గాక ఆదరించ వచ్చునా
గయ్యాళిని వూడిగాకాంతల నెందు
చెయ్యార నోరిచి వారిచేత మాటఁ బడే నిన్ను
నెయ్యాన నవ్వించ నైతి నీ వలుగ వలదా

(॥మొక్కే॥)
చెల్లఁ బో నీవు గూడఁగా చేరి దూర వచ్చునా
కల్ల రులయిన నీ భోగపు టింతులా
మిల్లనే యా ముసుఁగు నామీఁదఁ వేసి కూడితివి
యెల్లగా శ్రీవేంకటేశ యిది యెఱుఁగనైతి

(||pallavi||)
mŏkke levayya nī vela musum̐gu vĕṭṭugŏṁṭivi
sikkiṁchi yābĕ naṁṭenu siṁta gādā nīgunu

(||mŏkke||)
yĕṁta kĕṁta sūḍavo ne nĕdurāḍa vachchunā
jaṁtalaina nī mohabu sadula toḍa
paṁtāna vāru varase pāṭlane paḍe nīgu
saṁtosamu seyanaidi sālu nāde neramī

(||mŏkke||)
ayyayyā pābamu gāga ādariṁcha vachchunā
gayyāḽini vūḍigāgāṁtala nĕṁdu
sĕyyāra norisi vāriseda māḍam̐ baḍe ninnu
nĕyyāna navviṁcha naidi nī valuga valadā

(||mŏkke||)
sĕllam̐ bo nīvu gūḍam̐gā seri dūra vachchunā
kalla rulayina nī bhogabu ṭiṁtulā
millane yā musum̐gu nāmīm̐dam̐ vesi kūḍidivi
yĕllagā śhrīveṁkaḍeśha yidi yĕṟum̐ganaidi