Mokkave yaadanigi munnidinerami deera

మొక్కవే యాతనికి మున్నిటినేరమి దీర
Language

(॥పల్లవి॥)
మొక్కవే యాతనికి మున్నిటినేరమి దీర
మొక్కళీ డాతఁడు నీ మోవెంగిలే చాలు

(॥మొక్క॥)
వేసటేలే నీకూ వేగినంతా నాతఁడు
ఆసలు రేఁచి రేఁచి ఆయాలంటఁగా
వేసములఁ దిట్టకువే విభుని నేమనినాను
దోసము లందురు కాలుదొక్కినదే చాలును

(॥మొక్క॥)
జంకెనలేలే నీకు సమ్మతించి నీమగఁడు
వుంకువగా విడెమిచ్చి వూరడించఁగా
మంకుఁదనాలు చూపకు మగనాలి మీరితేను
అంకెగాదు నీచెమట నద్దినదే చాలును

(॥మొక్క॥)
సిగ్గులు వడఁగనేల శ్రీవేంకటేశ్వరుఁడు
అగ్గమై నిన్నుఁ గలసి ఆదరించఁగా
వెగ్గళించి కితనికి వెక్కసాలు చూపితేను
సగ్గవు కోరికలెల్లా సరసమే చాలును

(||pallavi||)
mŏkkave yādanigi munniḍinerami dīra
mŏkkaḽī ḍādam̐ḍu nī movĕṁgile sālu

(||mŏkka||)
vesaḍele nīgū veginaṁtā nādam̐ḍu
āsalu rem̐si rem̐si āyālaṁṭam̐gā
vesamulam̐ diṭṭaguve vibhuni nemaninānu
dosamu laṁduru kāludŏkkinade sālunu

(||mŏkka||)
jaṁkĕnalele nīgu sammadiṁchi nīmagam̐ḍu
vuṁkuvagā viḍĕmichchi vūraḍiṁcham̐gā
maṁkum̐danālu sūbagu maganāli mīridenu
aṁkĕgādu nīsĕmaḍa naddinade sālunu

(||mŏkka||)
siggulu vaḍam̐ganela śhrīveṁkaḍeśhvarum̐ḍu
aggamai ninnum̐ galasi ādariṁcham̐gā
vĕggaḽiṁchi kidanigi vĕkkasālu sūbidenu
saggavu korigalĕllā sarasame sālunu