మొక్కవే చెలువునికి ముమ్మాటికి
(॥పల్లవి॥)
మొక్కవే చెలువునికి ముమ్మాటికి
వెక్కసమైతే సిగ్గులు వెల్లులై నిగుడును
(॥॥)
పంతమాడవలెనా పతితోడ సతికిని
వంతుకుఁ బ్రియము చెప్పవలెఁగాక
దొంతులు పేరుచఁబోతే తుద కెక్కుఁ జలములు
సంతోసించితే వలపు చవులై నిలుచును
(॥॥)
బిగియఁగవలెనా పెనగేటివిభుఁనితో
జిగిమించ నూడిగాలు సేయుట గాక
చిగిరింపించఁగబోతే చిమ్మిఁరేగును మంకులు
నగితే మచ్చికలతో నాటుకొను మనసు
(॥॥)
గుట్టుచూపవలెనా కోరి శ్రీవేంకటేశుతో
ఇట్టె కలుయుటే యెన్నికగాక
రట్టుసేయఁబోతే రతులిట్టె పెచ్చుపెరుగు
చుట్టరికమున నుంటే సులభమౌ భోగము
(||pallavi||)
mŏkkave sĕluvunigi mummāḍigi
vĕkkasamaide siggulu vĕllulai niguḍunu
(||||)
paṁtamāḍavalĕnā padidoḍa sadigini
vaṁtugum̐ briyamu sĕppavalĕm̐gāga
dŏṁtulu perusam̐bode tuda kĕkkum̐ jalamulu
saṁtosiṁchide valabu savulai nilusunu
(||||)
bigiyam̐gavalĕnā pĕnageḍivibhum̐nido
jigimiṁcha nūḍigālu seyuḍa gāga
sigiriṁpiṁcham̐gabode simmim̐regunu maṁkulu
nagide machchigalado nāḍugŏnu manasu
(||||)
guṭṭusūbavalĕnā kori śhrīveṁkaḍeśhudo
iṭṭĕ kaluyuḍe yĕnnigagāga
raṭṭuseyam̐bode raduliṭṭĕ pĕchchubĕrugu
suṭṭarigamuna nuṁṭe sulabhamau bhogamu