మొక్కవే పాదాలకు మొనసి నీవు
(॥పల్లవి॥)
మొక్కవే పాదాలకు మొనసి నీవు
మిక్కిలి నీ నాయకుఁడు మేలువాఁడే నీకు
(॥॥)
చెక్కునఁబెట్టినచెయ్యిసెలవుల నీనవ్వు
నిక్కిచూచి మోహించెనే నీరమణుడు
ముక్కుపైఁ బెట్టిన వేలు ముంచిననీనివ్వెరగు
తక్కక పొగడీ నిదే తమితోడ నిపుడు
(॥॥)
పడఁతులపై వొరగుపాదముపై పాదము
చిడుముడితోఁ దలపోసెఁ జిత్తములోన
అడియాసమాటలు అట్టె పైకొనే జోకలు
తడయక సంతోసించె తన్నుఁదానె యిపుడు
(॥॥)
సారెకుఁజెమటసోన జారినపయ్యదకొంగు
చేరి వేరులేక యెంచీ శ్రీవేంకటేశుఁ-
డీరీతిఁదా నినుఁగూడె యితవరి నీప్రియాలు
తారుకాణై తేఁ బొదిగి దైవార నిపుడు
(||pallavi||)
mŏkkave pādālagu mŏnasi nīvu
mikkili nī nāyagum̐ḍu meluvām̐ḍe nīgu
(||||)
sĕkkunam̐bĕṭṭinasĕyyisĕlavula nīnavvu
nikkisūsi mohiṁchĕne nīramaṇuḍu
mukkubaim̐ bĕṭṭina velu muṁchinanīnivvĕragu
takkaga pŏgaḍī nide tamidoḍa nibuḍu
(||||)
paḍam̐tulabai vŏragubādamubai pādamu
siḍumuḍidom̐ dalabosĕm̐ jittamulona
aḍiyāsamāḍalu aṭṭĕ paigŏne jogalu
taḍayaga saṁtosiṁchĕ tannum̐dānĕ yibuḍu
(||||)
sārĕgum̐jĕmaḍasona jārinabayyadagŏṁgu
seri verulega yĕṁchī śhrīveṁkaḍeśhum̐-
ḍīrīdim̐dā ninum̐gūḍĕ yidavari nīpriyālu
tārugāṇai tem̐ bŏdigi daivāra nibuḍu