Mokkaro sevimcharo munulaala rshulaala

మొక్కరో సేవించరో మునులాల ఋషులాల
Language

(॥పల్లవి॥)
మొక్కరో సేవించరో మునులాల ఋషులాల
దిక్కులు సాధించీ నదే దేవదేవుఁడు

(॥॥)
ఆరదముమీఁద నెక్కి అమరులు గొలువఁగ
సిరితో వీదుల నేగీ శ్రీవిభుఁడు
గరుడ ధ్వజముతోడ ఘనచక్రాయుధముతో
దొరదైవ మదిగో పొందుగ మెరసీని

(॥॥)
గొడుగులుఁ బడిగెలు కోటానఁ గోట్లాడఁగా
వెడలె వెడలె నదే విష్ణుదేవుఁడు
నడుమను రంభాదులు నాట్యములాడఁగాను
అడరి వుత్సవమందీ నాదిమూరితి

(॥॥)
సారె నింటింటి విందులు చవులు చూచుకొంటాను
సారెకు రథము దోలీ సర్వేశుఁడు
ఆరీతి శ్రీవేంకటేశు డలమేలుమంగఁ గూడి
కోరిన వరములిచ్చీఁ గుంభిణీరమణుఁడు

(||pallavi||)
mŏkkaro seviṁcharo munulāla ṛṣhulāla
dikkulu sādhiṁchī nade devadevum̐ḍu

(||||)
āradamumīm̐da nĕkki amarulu gŏluvam̐ga
sirido vīdula negī śhrīvibhum̐ḍu
garuḍa dhvajamudoḍa ghanasakrāyudhamudo
dŏradaiva madigo pŏṁduga mĕrasīni

(||||)
gŏḍugulum̐ baḍigĕlu koḍānam̐ goṭlāḍam̐gā
vĕḍalĕ vĕḍalĕ nade viṣhṇudevum̐ḍu
naḍumanu raṁbhādulu nāṭyamulāḍam̐gānu
aḍari vutsavamaṁdī nādimūridi

(||||)
sārĕ niṁṭiṁṭi viṁdulu savulu sūsugŏṁṭānu
sārĕgu rathamu dolī sarveśhum̐ḍu
ārīdi śhrīveṁkaḍeśhu ḍalamelumaṁgam̐ gūḍi
korina varamulichchīm̐ guṁbhiṇīramaṇum̐ḍu