Mokkaro parushalu mohanamoordigi

మొక్కరో పరుషలు మోహనమూర్తికి
Language

(॥పల్లవి॥)
మొక్కరో పరుషలు మోహనమూర్తికి
వెక్కసమగు శ్రీవేంకటపతికి

(॥॥)
హరి రథ మదే ముందరి నొగ లవిగో
గరుడ ధ్వజ మదే ఘంట లవే
సరిఁ దిరిగేటి కాంచన చక్రము లవే
తిరు వీధుల నేతెంచేఁ గనరో

(॥॥)
తేరు పడగలవే తెల్ల గొడుగులవే
తోరణంబులవే సారథి వాఁడే
ధీరతఁగట్టిన దివ్యహయములవే
మేరువు వలెనే మెరసీ నదివో

(॥॥)
పసిఁడికుండ యదే పట్టు కుచ్చులవే
వెసనడుమ వాఁడే శ్రీ వేంకటేశుఁడు
యెసగి యురమునను యిదే యలమేల్మంగ
వసుధ పెండ్లితేరు వచ్చీ నిదివో

(||pallavi||)
mŏkkaro paruṣhalu mohanamūrdigi
vĕkkasamagu śhrīveṁkaḍabadigi

(||||)
hari ratha made muṁdari nŏga lavigo
garuḍa dhvaja made ghaṁṭa lave
sarim̐ dirigeḍi kāṁchana sakramu lave
tiru vīdhula nedĕṁchem̐ ganaro

(||||)
teru paḍagalave tĕlla gŏḍugulave
toraṇaṁbulave sārathi vām̐ḍe
dhīradam̐gaṭṭina divyahayamulave
meruvu valĕne mĕrasī nadivo

(||||)
pasim̐ḍiguṁḍa yade paṭṭu kuchchulave
vĕsanaḍuma vām̐ḍe śhrī veṁkaḍeśhum̐ḍu
yĕsagi yuramunanu yide yalamelmaṁga
vasudha pĕṁḍlideru vachchī nidivo