Mokkaro mokkaro meeru momunam galalu dere

మొక్కరో మొక్కరో మీరు మోమునఁ గళలు దేరె
Language

(॥పల్లవి॥)
మొక్కరో మొక్కరో మీరు మోమునఁ గళలు దేరె
యెక్కువ శ్రీవేంకటేశుఁ డింతులలో వాఁడె

(॥మొక్కరో॥)
తేరుమీఁద నెక్కీ హరి దేవుళ్లుఁ దానును వాఁడె
భోరునను దేవదుందుభలు వాఁగగా
తోరపుమోఁకులు వట్టి దొరలు బ్రహ్మదు లెల్ల
ధీరతఁ దీశే రదే తిరువీధులందును

(॥మొక్కరో॥)
వేడుక రథముమీఁద వెలసే శ్రీపతివొద్ద
ఆడేరు పాడేరు అచ్చర లెల్ల
నీడెపు సెలవులతో వెలఁదులతో హరి
యీడు లేక యేఁగి వచ్చీ నింటింటి వాకిటను

(॥మెక్కరో॥)
శ్రీవెంకటేశుఁడు వాఁడె చేరి యలమేలుమంగ
సావధానమున సరసము లాడఁగ
దేవాసనం బెక్కి తేఁకువ నారగింపులు
వావిరిఁ జేకొనో వాఁడె వాడవాడలను

(||pallavi||)
mŏkkaro mŏkkaro mīru momunam̐ gaḽalu derĕ
yĕkkuva śhrīveṁkaḍeśhum̐ ḍiṁtulalo vām̐ḍĕ

(||mŏkkaro||)
terumīm̐da nĕkkī hari devuḽlum̐ dānunu vām̐ḍĕ
bhorunanu devaduṁdubhalu vām̐gagā
torabumom̐kulu vaṭṭi dŏralu brahmadu lĕlla
dhīradam̐ dīśhe rade tiruvīdhulaṁdunu

(||mŏkkaro||)
veḍuga rathamumīm̐da vĕlase śhrībadivŏdda
āḍeru pāḍeru achchara lĕlla
nīḍĕbu sĕlavulado vĕlam̐dulado hari
yīḍu lega yem̐gi vachchī niṁṭiṁṭi vāgiḍanu

(||mĕkkaro||)
śhrīvĕṁkaḍeśhum̐ḍu vām̐ḍĕ seri yalamelumaṁga
sāvadhānamuna sarasamu lāḍam̐ga
devāsanaṁ bĕkki tem̐kuva nāragiṁpulu
vāvirim̐ jegŏno vām̐ḍĕ vāḍavāḍalanu