(॥పల్లవి॥)
మొక్కరో మీరు మోసపోక - మీకు
దిక్కు దెసైన ఆదిదేవునికి
(॥మొక్క॥)
మారుచేతులీయవద్దు మారుగాళ్ళీయవద్దు
బీరాన గుండెలు గోసి పెట్టవద్దు
గోరపడి చిచ్చులోన కొండాలు చొఱవద్దు
ఊరకే మీవారమని వున్నఁ జాలు
(॥మొక్క॥)
సిడిదలలియ్యవద్దు జీవాలఁ జంపవద్దు
బడి బడి పగ్గాలఁ బారవద్దు
సిడిమీఁద బిత్తరప బిమ్ములు చిమ్మఁగవద్దు
కడనుం............................. దారి గన్నఁ జాలు
(॥మొక్క॥)
బగ్గన యెక్కడ డొక్కపడునో యేమరవద్దు
బగ్గివడ్డ యమబాధఁ బడవద్దు
ఎగ్గు సిగ్గులేక వేంకటేశుని దాసులఁజేరి
అగ్గలపు పాదరేణువైనఁ జాలు
(||pallavi||)
mŏkkaro mīru mosaboga - mīgu
dikku dĕsaina ādidevunigi
(||mŏkka||)
mārusedulīyavaddu mārugāḽḽīyavaddu
bīrāna guṁḍĕlu gosi pĕṭṭavaddu
gorabaḍi sichchulona kŏṁḍālu sŏṟavaddu
ūrage mīvāramani vunnam̐ jālu
(||mŏkka||)
siḍidalaliyyavaddu jīvālam̐ jaṁpavaddu
baḍi baḍi paggālam̐ bāravaddu
siḍimīm̐da bittaraba bimmulu simmam̐gavaddu
kaḍanuṁ............................. dāri gannam̐ jālu
(||mŏkka||)
baggana yĕkkaḍa ḍŏkkabaḍuno yemaravaddu
baggivaḍḍa yamabādham̐ baḍavaddu
ĕggu siggulega veṁkaḍeśhuni dāsulam̐jeri
aggalabu pādareṇuvainam̐ jālu