Mokkaramma selulaala mohanaagaarumdu veemde

మొక్కరమ్మ చెలులాల మోహనాకారుఁడు వీఁడె
Language

(॥పల్లవి॥)
మొక్కరమ్మ చెలులాల మోహనాకారుఁడు వీఁడె
వెక్కసపుచేఁతల శ్రీవేంకటేశుఁడు*

(॥మొక్క॥)
సంతోసాన నాదె పెండ్లి చవికెలోఁ గూచున్నాఁడు
మంతనము లాదు కొంటా మగువలతో
పొంతనే సరసాలాడీ భూపతి చెరువు దండ
వింత సింగారాలతో శ్రీవేంకటేశుఁడు

(॥మొక్క॥)
జోడైన రత్నాల సొమ్ముల వెట్టుకున్నాఁడు
వాదికైన వూడిగపువారితోఁ గూడి
వీడెములు సేసుకొంటా విక విక నవ్వుకొంటా
వేడుకకాఁడైనాఁడు శ్రీవేంకటేశుఁడు

(॥మొక్క॥)
తలకొన్న కమ్మఁ బూవు దండలతో నున్నవాడు
లలిఁ బూసిన పరిమళాలు మించుగా
పలురతుల దనిసి బాగుగా దేవుళ్ళుఁ దాను
విలసిల్లీ నిదిగో శ్రీవేంకటేశుఁడు

(||pallavi||)
mŏkkaramma sĕlulāla mohanāgārum̐ḍu vīm̐ḍĕ
vĕkkasabusem̐tala śhrīveṁkaḍeśhum̐ḍu*

(||mŏkka||)
saṁtosāna nādĕ pĕṁḍli savigĕlom̐ gūsunnām̐ḍu
maṁtanamu lādu kŏṁṭā maguvalado
pŏṁtane sarasālāḍī bhūbadi sĕruvu daṁḍa
viṁta siṁgārālado śhrīveṁkaḍeśhum̐ḍu

(||mŏkka||)
joḍaina ratnāla sŏmmula vĕṭṭugunnām̐ḍu
vādigaina vūḍigabuvāridom̐ gūḍi
vīḍĕmulu sesugŏṁṭā viga viga navvugŏṁṭā
veḍugagām̐ḍainām̐ḍu śhrīveṁkaḍeśhum̐ḍu

(||mŏkka||)
talagŏnna kammam̐ būvu daṁḍalado nunnavāḍu
lalim̐ būsina parimaḽālu miṁchugā
paluradula danisi bāgugā devuḽḽum̐ dānu
vilasillī nidigo śhrīveṁkaḍeśhum̐ḍu