మొక్కలీఁడవయ్య నీవు ముద్దు విట్ఠలా మా
(॥పల్లవి॥)
మొక్కలీఁడవయ్య నీవు ముద్దు విట్ఠలా మా-
పక్కవాయ వెప్పుడును పండరంగివిట్ఠలా
(॥॥)
చిక్కని చల్లలమ్మఁ గాఁ జేరి విట్ఠలా మా-
జక్కవచన్నులంటేవు సారె విట్ఠలా
తొక్కేవు మాపాదాలు దొమ్మివిట్ఠలా
పక్కన మై చెమరించెఁ బండరంగివిట్ఠలా
(॥॥)
వేళగాచి వచ్చేవు మావెంట విట్ఠలా కడు-
మేలములాడఁ జేరేవు మేటివిట్ఠలా
కోలుముందై చెనకేవు గొంటువిట్ఠలా
పాలుగాంచి(చే) వేళనే పండరంగివిట్ఠలా
(॥॥)
సొరిది గచ్చకాయలు చూప విట్ఠలా
సరిబేసు లాడేవు జాణవిట్ఠలా
గొరబై శ్రీ వేంకటాద్రిఁ గూడి విట్ఠలా
పరగ మావద్ద నుంటి పండరంగివిట్ఠలా
(||pallavi||)
mŏkkalīm̐ḍavayya nīvu muddu viṭṭhalā mā-
pakkavāya vĕppuḍunu paṁḍaraṁgiviṭṭhalā
(||||)
sikkani sallalammam̐ gām̐ jeri viṭṭhalā mā-
jakkavasannulaṁṭevu sārĕ viṭṭhalā
tŏkkevu mābādālu dŏmmiviṭṭhalā
pakkana mai sĕmariṁchĕm̐ baṁḍaraṁgiviṭṭhalā
(||||)
veḽagāsi vachchevu māvĕṁṭa viṭṭhalā kaḍu-
melamulāḍam̐ jerevu meḍiviṭṭhalā
kolumuṁdai sĕnagevu gŏṁṭuviṭṭhalā
pālugāṁchi(se) veḽane paṁḍaraṁgiviṭṭhalā
(||||)
sŏridi gachchagāyalu sūba viṭṭhalā
saribesu lāḍevu jāṇaviṭṭhalā
gŏrabai śhrī veṁkaḍādrim̐ gūḍi viṭṭhalā
paraga māvadda nuṁṭi paṁḍaraṁgiviṭṭhalā