మోహమెంతో కోపమెంతో ముదిత నీయెడ నేఁడు
(॥పల్లవి॥)
మోహమెంతో కోపమెంతో ముదిత నీయెడ నేఁడు
వూహల యీ భావములు వొక్క దోమటాయ
(॥మోహ॥)
సెలవినే నవ్వెఁగాని చేకొని మాటాడదాయ
చెలువుఁడ నీవు విచ్చేసితివంటే
వలచేత మొక్కెఁగాని వడి సుద్దిచెప్పదాయ
పొలసి నీకడకు నేఁ బోయేనంటేను
(॥మోహ॥)
కన్నులనె చూచెఁగాని కమ్మర డగ్గరదాయ
సొన్నల నీగురుతులు చూపినాను
సన్నలనే మెచ్చెఁగాని సరి దండె మీఁటదాయ
పన్ని నీ వల్లంతనుండి పాడఁగాను
(॥మోహ॥)
పరవశ మందెఁగాని పైకొని బిగించదాయ
గరిమఁ గాఁగిట నీవు గలయఁగాను
సిరుల సంతసమందె శ్రీవేంకటేశ నేఁడు
శిరసువంచి కొంత సిగ్గువడదాయ
(||pallavi||)
mohamĕṁto kobamĕṁto mudida nīyĕḍa nem̐ḍu
vūhala yī bhāvamulu vŏkka domaḍāya
(||moha||)
sĕlavine navvĕm̐gāni segŏni māḍāḍadāya
sĕluvum̐ḍa nīvu vichchesidivaṁṭe
valaseda mŏkkĕm̐gāni vaḍi suddisĕppadāya
pŏlasi nīgaḍagu nem̐ boyenaṁṭenu
(||moha||)
kannulanĕ sūsĕm̐gāni kammara ḍaggaradāya
sŏnnala nīgurudulu sūbinānu
sannalane mĕchchĕm̐gāni sari daṁḍĕ mīm̐ṭadāya
panni nī vallaṁtanuṁḍi pāḍam̐gānu
(||moha||)
paravaśha maṁdĕm̐gāni paigŏni bigiṁchadāya
garimam̐ gām̐giḍa nīvu galayam̐gānu
sirula saṁtasamaṁdĕ śhrīveṁkaḍeśha nem̐ḍu
śhirasuvaṁchi kŏṁta sigguvaḍadāya