మోహాంధకారాన నీవు ముందెరఁగ వింతె కాక
(॥పల్లవి॥)
మోహాంధకారాన నీవు ముందెరఁగ వింతె కాక
యీహల నీకొలువులో నెదుటనే వుండనా
(॥మోహం॥)
నవ్వు నవ్వి ఆపెదిక్కు నాఁటఁగఁ జూచేయప్పుడు
అవ్వల నీకుఁ జేయిచ్చి అండ నుండనా
చివ్వన రతికి నాపెచెరఁగు వట్టేయప్పుడు
నివ్వటిల్లఁ గుంచ వేసి నీవెంట రానా
(॥మోహం॥)
ఆపెతోడఁ బచ్చిమాటలాడి చొక్కించేయప్పుడు
మాపుదాఁకా నీకు ఆకు మడి చియ్యనా
చేపట్టి యేఁటికో నీవు చేయెత్తి మొక్కేయప్పుడు
పైపై నాలవట్టము పసగా విసరనా
(॥మోహం॥)
కందువ నాచెలి నీవు కాఁగిలించుకొన్నప్పుడు
పొంది నీపచ్చడము గప్పక వుండనా
అంది శ్రీ వేంకటేశ నన్నంతలోఁ గని కూడితి
నింద లేక నీకు తోడునీడనై నే నుండనా
(||pallavi||)
mohāṁdhagārāna nīvu muṁdĕram̐ga viṁtĕ kāga
yīhala nīgŏluvulo nĕduḍane vuṁḍanā
(||mohaṁ||)
navvu navvi ābĕdikku nām̐ṭam̐gam̐ jūseyappuḍu
avvala nīgum̐ jeyichchi aṁḍa nuṁḍanā
sivvana radigi nābĕsĕram̐gu vaṭṭeyappuḍu
nivvaḍillam̐ guṁcha vesi nīvĕṁṭa rānā
(||mohaṁ||)
ābĕdoḍam̐ bachchimāḍalāḍi sŏkkiṁcheyappuḍu
mābudām̐kā nīgu āgu maḍi siyyanā
sebaṭṭi yem̐ṭigo nīvu seyĕtti mŏkkeyappuḍu
paibai nālavaṭṭamu pasagā visaranā
(||mohaṁ||)
kaṁduva nāsĕli nīvu kām̐giliṁchugŏnnappuḍu
pŏṁdi nībachchaḍamu gappaga vuṁḍanā
aṁdi śhrī veṁkaḍeśha nannaṁtalom̐ gani kūḍidi
niṁda lega nīgu toḍunīḍanai ne nuṁḍanā