Mogamulu soodaga muchcha tela paayunu

మొగములు చూడక ముచ్చ టేల పాయును
Language

(॥పల్లవి॥)
మొగములు చూడక ముచ్చ టేల పాయును
యెగసక్కేలకు నీవు యేమి సేసే వీడనూ

(॥॥)
పంతపు మాటల దాపె పాయపు మదము దాపె
ఇంతుల మాటల కెల్ల నియ్య కొనీనా
చెంతల నీవే విచ్చేసి చెక్కు నొక్కి బుజ్జగించు
యెంత పని గద్దు నీకు యేమి సేసే వీడనూ

(॥॥)
పట్టపు దేవులాపె బలువైన దొర యాపె
యిట్టి కానికె ల కెల్ల నియ్య కొనీనా
జట్టి గా నీ వండనుండి చనవిచ్చి కౌఁగిలించు
ఇట్టు నట్టుఁ బరాకుల నేమి సేసే వీడనూ

(॥॥)
వలపు గలిగినాపె వడిఁ దమకపుటాపె
యెలమి లేక లంపితే నియ్యకొనీనా
కలిసితివి శ్రీ వేంకటేశ దినము రమ్ము
యెలయింపు నవ్వులతో నేమి సేసే వీడనూ

(||pallavi||)
mŏgamulu sūḍaga muchcha ṭela pāyunu
yĕgasakkelagu nīvu yemi sese vīḍanū

(||||)
paṁtabu māḍala dābĕ pāyabu madamu dābĕ
iṁtula māḍala kĕlla niyya kŏnīnā
sĕṁtala nīve vichchesi sĕkku nŏkki bujjagiṁchu
yĕṁta pani gaddu nīgu yemi sese vīḍanū

(||||)
paṭṭabu devulābĕ baluvaina dŏra yābĕ
yiṭṭi kānigĕ la kĕlla niyya kŏnīnā
jaṭṭi gā nī vaṁḍanuṁḍi sanavichchi kaum̐giliṁchu
iṭṭu naṭṭum̐ barāgula nemi sese vīḍanū

(||||)
valabu galiginābĕ vaḍim̐ damagabuḍābĕ
yĕlami lega laṁpide niyyagŏnīnā
kalisidivi śhrī veṁkaḍeśha dinamu rammu
yĕlayiṁpu navvulado nemi sese vīḍanū