Mogamu soosude mokkude saalu

మొకము చూచుటే మొక్కుటే చాలు
Language

(॥పల్లవి॥)
మొకము చూచుటే మొక్కుటే చాలు
యెకసక్కెమాయఁ బని యేలరా యీ దోసము

(॥మొక॥)
వట్టిపను లెల్లఁజెప్పి వద్దివారి నెల్ల నంపి
వొట్టుక నన్నుఁ జెనకే వోరీ నీవు
గట్టిగా నావూళిగపుకాంతల నంటితివట
యిట్టె నన్నుఁ బైకోనేవు యిఁక వొద్దు దోసము

(॥మొక॥)
యేకతాలు గడియించి ఇంటిలోనికిఁ బిలిచి
యీకడ నన్ను బోదించే వేరా నీవు
ఆకుమడి చిచ్చేటిఅంగన నంటితివట
నీకు నాకు నింతచాలు నిలు నిలు దోసము

(॥మొక॥)
అలసితి నని వచ్చి అంగము పై వేసేవు
చెలఁగి కాఁగిలించేవు చెల్లురా నీవు
బలిమి నన్నుఁ గూడితివి పంతపు శ్రీవేంకటేశ
తొలఁగి కిమ్ముల పొందు తొడుకకు దోసము

(||pallavi||)
mŏgamu sūsuḍe mŏkkuḍe sālu
yĕgasakkĕmāyam̐ bani yelarā yī dosamu

(||mŏga||)
vaṭṭibanu lĕllam̐jĕppi vaddivāri nĕlla naṁpi
vŏṭṭuga nannum̐ jĕnage vorī nīvu
gaṭṭigā nāvūḽigabugāṁtala naṁṭidivaḍa
yiṭṭĕ nannum̐ baigonevu yim̐ka vŏddu dosamu

(||mŏga||)
yegadālu gaḍiyiṁchi iṁṭilonigim̐ bilisi
yīgaḍa nannu bodiṁche verā nīvu
āgumaḍi sichcheḍiaṁgana naṁṭidivaḍa
nīgu nāgu niṁtasālu nilu nilu dosamu

(||mŏga||)
alasidi nani vachchi aṁgamu pai vesevu
sĕlam̐gi kām̐giliṁchevu sĕllurā nīvu
balimi nannum̐ gūḍidivi paṁtabu śhrīveṁkaḍeśha
tŏlam̐gi kimmula pŏṁdu tŏḍugagu dosamu