మొగము చూడఁగానే మొరఁగేటికే
(॥పల్లవి॥)
మొగము చూడఁగానే మొరఁగేటికే
వెగటుగా నీవేళ వేసటేఁటికే
(॥మొగ॥)
సేసలు వెట్టేయప్పుడు సిగ్గులువడుట గాక
ఆసఁ గాఁపురము సేసే అప్పుడేఁటికే
వాసులు వట్టేయప్పుడే వడి జంకింతురు గాక
యీసులేక నవ్వేయప్పుడిఁక నేఁటికే
(॥మొగ॥)
యెడసి వుండినవేళ యెగ్గులు వట్టుట గాక
అడరి వీడెమిచ్చే యప్పుడేఁటికే
తడవినయప్పుడే తప్పులువట్టుట గాక
వొడికమై వుండఁగాను వొరయఁగనేఁటికే
(॥మొగ॥)
కంగియుండినయప్పుడు కాఁకలు చల్లుట గాక
అంగములంటి కూడిన యప్పుడేఁటికే
సంగతిగా శ్రీవేంకటేశ్వరుఁ డేలె నిన్నిన్నిటా
సంగడి మెచ్చుటగాక చలము మరేఁటికే
(||pallavi||)
mŏgamu sūḍam̐gāne mŏram̐geḍige
vĕgaḍugā nīveḽa vesaḍem̐ṭige
(||mŏga||)
sesalu vĕṭṭeyappuḍu sigguluvaḍuḍa gāga
āsam̐ gām̐puramu sese appuḍem̐ṭige
vāsulu vaṭṭeyappuḍe vaḍi jaṁkiṁturu gāga
yīsulega navveyappuḍim̐ka nem̐ṭige
(||mŏga||)
yĕḍasi vuṁḍinaveḽa yĕggulu vaṭṭuḍa gāga
aḍari vīḍĕmichche yappuḍem̐ṭige
taḍavinayappuḍe tappuluvaṭṭuḍa gāga
vŏḍigamai vuṁḍam̐gānu vŏrayam̐ganem̐ṭige
(||mŏga||)
kaṁgiyuṁḍinayappuḍu kām̐kalu salluḍa gāga
aṁgamulaṁṭi kūḍina yappuḍem̐ṭige
saṁgadigā śhrīveṁkaḍeśhvarum̐ ḍelĕ ninninniḍā
saṁgaḍi mĕchchuḍagāga salamu marem̐ṭige