Mogamoo nodidimi monnane koodidimi

మొగమూ నోడితిమి మొన్ననే కూడితిమి
Language

(॥పల్లవి॥)
మొగమూ నోడితిమి మొన్ననే కూడితిమి
సగము జాణతనాలు చల్ల నింతవలెనా

(॥॥)
కానుక లిచ్చితిమి కన్నుల మెచ్చితిమి
పోనీరాదా యిఁకనైనాఁ బోయినపొద్దు
నానె నాకు వలపూ నవ్వులాయఁ దలఁవూ
మానరాదా యిఁకనైనా మామీఁదిఆనలు

(॥॥)
చేతుల మొక్కితిమీ చేఁతకుఁ జిక్కితిమీ
తోతో ఇంకానేల తొల్లిటివాని
రాతి రన్నీఁ గంటిమీ రచ్చలనే వింటిమీ
కాతర మింతేనేల కమ్మటి మాతోను

(॥॥)
దగ్గరి కూచుంటిమీ తప్పులు లేవంటిమీ
సిగ్గులు నీకిఁకనేల చెల్లు నన్నియు
నిగ్గుల శ్రీవేంకటేశ నే నలమేలుమంగను
అగ్గమై కూడితి మింకా నసురుసురేలా

(||pallavi||)
mŏgamū noḍidimi mŏnnane kūḍidimi
sagamu jāṇadanālu salla niṁtavalĕnā

(||||)
kānuga lichchidimi kannula mĕchchidimi
ponīrādā yim̐kanainām̐ boyinabŏddu
nānĕ nāgu valabū navvulāyam̐ dalam̐vū
mānarādā yim̐kanainā māmīm̐diānalu

(||||)
sedula mŏkkidimī sem̐tagum̐ jikkidimī
todo iṁkānela tŏlliḍivāni
rādi rannīm̐ gaṁṭimī rachchalane viṁṭimī
kādara miṁtenela kammaḍi mādonu

(||||)
daggari kūsuṁṭimī tappulu levaṁṭimī
siggulu nīgim̐kanela sĕllu nanniyu
niggula śhrīveṁkaḍeśha ne nalamelumaṁganu
aggamai kūḍidi miṁkā nasurusurelā