మొకమొక మెదుటనె ముంగోప మిఁక నేల
(॥పల్లవి॥)
మొకమొక మెదుటనె ముంగోప మిఁక నేల
పకపక నగుతానె పంత మిచ్చె నాతఁడు
(॥మెక॥)
ఆతడె నీ వున్నచోటి కంగనల నంపఁగాను
యీతలఁ దల వంచేవు యేలమ్మ నీవు
కాతరిం చంతటఁ బోక ఘనుఁడు దానె వచ్చె
చేతులార నీవ నేవ నేయవమ్మ యిపుడు
(॥మెక॥)
కడు మోహములె నీకుఁ గప్ప మాతఁడు వెట్టఁగ
యెడమాటలఁ దిట్టించే వే లమ్మ నీవు
తడవి మీ రాతని తరుణులు దొబ్బిరట
గొడవలు దీర వేఁడుకోవమ్మ పతిని
(॥మెక॥)
ఆయములు సోఁక నాతఁ డాన లెల్లఁ బెట్టుకోఁగా
యీయేడ నవ్వులు నవ్వే వే మమ్మ నీవు
వోయమ్మ శ్రీవెంకటేశుఁ డోఁగునూతులలోఁ గూడె
నీయిచ్చ నాతఁ డున్నాఁడు నీవు మెచ్చ రాదా
(||pallavi||)
mŏgamŏga mĕduḍanĕ muṁgoba mim̐ka nela
pagabaga nagudānĕ paṁta michchĕ nādam̐ḍu
(||mĕga||)
ādaḍĕ nī vunnasoḍi kaṁganala naṁpam̐gānu
yīdalam̐ dala vaṁchevu yelamma nīvu
kādariṁ saṁtaḍam̐ boga ghanum̐ḍu dānĕ vachchĕ
sedulāra nīva neva neyavamma yibuḍu
(||mĕga||)
kaḍu mohamulĕ nīgum̐ gappa mādam̐ḍu vĕṭṭam̐ga
yĕḍamāḍalam̐ diṭṭiṁche ve lamma nīvu
taḍavi mī rādani taruṇulu dŏbbiraḍa
gŏḍavalu dīra vem̐ḍugovamma padini
(||mĕga||)
āyamulu som̐ka nādam̐ ḍāna lĕllam̐ bĕṭṭugom̐gā
yīyeḍa navvulu navve ve mamma nīvu
voyamma śhrīvĕṁkaḍeśhum̐ ḍom̐gunūdulalom̐ gūḍĕ
nīyichcha nādam̐ ḍunnām̐ḍu nīvu mĕchcha rādā