మొకమోటములకెల్ల మొదలు నేను
(॥పల్లవి॥)
మొకమోటములకెల్ల మొదలు నేను
వెకలి నీ తమకము విడిపించఁగలనా
(॥మొక॥)
ముద్దులనీమోము చూచి మొక్కకుండలేను నీతో
గద్దించి నే నలుగఁగఁగలనా
పొద్దువొద్దు నేఁ దలఁచి పులకించికుండలేను
వద్దని నీగుణములు వారించఁగలనా
(॥మొక॥)
చేరి నేను ముచ్చటలు చెప్పకుండలేను నీతో
ధీరత నేఁ జలము సాదించఁగలనా
పేరుకొని సారెసారెఁ బిలువకుండఁగలేను
దూరి దూరి నే నిన్నుఁ దుచ్చమాడఁగలనా
(॥మొక॥)
సతమైన నిన్నుఁ గూడి సంతసించకుండలేను
ఇతరులవలె నెగ్గు లెంచఁగలనా
రతివేళ నిన్నుఁ గడురాయడించకుండలేను
పతిగా శ్రీవేంకటేశ పంతమియ్యఁగలనా
(||pallavi||)
mŏgamoḍamulagĕlla mŏdalu nenu
vĕgali nī tamagamu viḍibiṁcham̐galanā
(||mŏga||)
muddulanīmomu sūsi mŏkkaguṁḍalenu nīdo
gaddiṁchi ne nalugam̐gam̐galanā
pŏdduvŏddu nem̐ dalam̐si pulagiṁchiguṁḍalenu
vaddani nīguṇamulu vāriṁcham̐galanā
(||mŏga||)
seri nenu muchchaḍalu sĕppaguṁḍalenu nīdo
dhīrada nem̐ jalamu sādiṁcham̐galanā
perugŏni sārĕsārĕm̐ biluvaguṁḍam̐galenu
dūri dūri ne ninnum̐ duchchamāḍam̐galanā
(||mŏga||)
sadamaina ninnum̐ gūḍi saṁtasiṁchaguṁḍalenu
idarulavalĕ nĕggu lĕṁcham̐galanā
radiveḽa ninnum̐ gaḍurāyaḍiṁchaguṁḍalenu
padigā śhrīveṁkaḍeśha paṁtamiyyam̐galanā