(॥పల్లవి॥)
మొగమోటదానవు మొదలనే నీవు
వగలెల్ల నుడుపంగ వచ్చె నాతఁ డదివో
(॥మొగ॥)
పట్టినదే పంతమా పడఁతి నీ వాతనితో
ఱట్టు సేయనంటే మెఱయించ రాదా
గుట్టు నీతోఁ జెప్పనా కోరి పై పై నున్నాఁడని
వట్టి కోపా లిఁకనేల వచ్చె నాతఁ డదివో
(॥మొగ॥)
చెల్లునంటాఁ జేతురా చెలులు విభునితోడ
కల్లగా దాతనిమాఁట కైకొనరాదా
అల్లప్పుడె మొక్కనా ఆతనిమారు నేనని
వల్లెవాటుతో దగ్గరి వచ్చె నాతఁ డదివో
(॥మొగ॥)
ఇంత నీకుఁ దగునా యిట్టి శ్రీవేంకటేశుతో
చెంత నానలు పెట్టఁగాఁ జేకొనరాదా
వింతలుగఁ గూడి నేఁడు విడెము దా నిచ్చేనంటా
వంతుకు నీయంకె కెల్ల వచ్చె నాతఁ డదివో
(||pallavi||)
mŏgamoḍadānavu mŏdalane nīvu
vagalĕlla nuḍubaṁga vachchĕ nādam̐ ḍadivo
(||mŏga||)
paṭṭinade paṁtamā paḍam̐ti nī vādanido
ṟaṭṭu seyanaṁṭe mĕṟayiṁcha rādā
guṭṭu nīdom̐ jĕppanā kori pai pai nunnām̐ḍani
vaṭṭi kobā lim̐kanela vachchĕ nādam̐ ḍadivo
(||mŏga||)
sĕllunaṁṭām̐ jedurā sĕlulu vibhunidoḍa
kallagā dādanimām̐ṭa kaigŏnarādā
allappuḍĕ mŏkkanā ādanimāru nenani
vallĕvāḍudo daggari vachchĕ nādam̐ ḍadivo
(||mŏga||)
iṁta nīgum̐ dagunā yiṭṭi śhrīveṁkaḍeśhudo
sĕṁta nānalu pĕṭṭam̐gām̐ jegŏnarādā
viṁtalugam̐ gūḍi nem̐ḍu viḍĕmu dā nichchenaṁṭā
vaṁtugu nīyaṁkĕ kĕlla vachchĕ nādam̐ ḍadivo