(॥పల్లవి॥)
మొగమిచ్చదానను మొదల నేను
తగులాయ రమ్మనవే దక్కెఁ దన పంతము
(॥మొగ॥)
యిచ్చకమాడే పతిని యేమనఁగ వచ్చునే
కచ్చు పెట్టి చెనకఁగా కాదందునటే
కొచ్చి కొచ్చి నవ్వఁగాను గుంపించవచ్చునా
మచ్చికతో రమ్మనవే మాయింటికి నిఁకను
(॥మొగ॥)
వీడెము చేతికియ్యఁగా వింతసేయవచ్చునా
వాడికలు చెప్పఁగాను వద్దందునటే
జోడు గూడి వుండఁగాను సొలయఁగవచ్చునా
వేడుకతో రమ్మనవే విఁటిఁ(వింటిఁ?) దనమాఁటలు
(॥మొగ॥)
పిలిచి కాఁగిలించఁగా పెనఁగఁగవచ్చునా
వలచి మోవియ్యఁగాను వంచింతునటే
యెలమి శ్రీవేంకటేశుఁ డింత సేసి నన్నుఁ గూడె
తెలిసితి రమ్మనవే దిష్టమాయఁ బనులు
(||pallavi||)
mŏgamichchadānanu mŏdala nenu
tagulāya rammanave dakkĕm̐ dana paṁtamu
(||mŏga||)
yichchagamāḍe padini yemanam̐ga vachchune
kachchu pĕṭṭi sĕnagam̐gā kādaṁdunaḍe
kŏchchi kŏchchi navvam̐gānu guṁpiṁchavachchunā
machchigado rammanave māyiṁṭigi nim̐kanu
(||mŏga||)
vīḍĕmu sedigiyyam̐gā viṁtaseyavachchunā
vāḍigalu sĕppam̐gānu vaddaṁdunaḍe
joḍu gūḍi vuṁḍam̐gānu sŏlayam̐gavachchunā
veḍugado rammanave vim̐ṭim̐(viṁṭim̐?) danamām̐ṭalu
(||mŏga||)
pilisi kām̐giliṁcham̐gā pĕnam̐gam̐gavachchunā
valasi moviyyam̐gānu vaṁchiṁtunaḍe
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁta sesi nannum̐ gūḍĕ
tĕlisidi rammanave diṣhṭamāyam̐ banulu