Mogamaayalaamdive mogani nimta sesidi

మొగమాయలాఁడివే మొగని నింత సేసితి
Language

(॥పల్లవి॥)
మొగమాయలాఁడివే మొగని నింత సేసితి
చిగురే చాఁగయైతేఁ జెప్పనేఁటికి

(॥మొగ॥)
మంతనా లాడియాడి మరిగించుకొంటివి
చెంతఁ జుట్టమ వైతివి సేవలు సేసి
వంతలకు మొక్కిమొక్కి వలపించుకొంటివి
యెంత సేయనుందానవో యిసుమంతదానవు

(॥మొగ॥)
సెలవుల నవ్వు నవ్వి చేతికి లోఁజేసుకొంటి
సలిగెదాన వైతివి చన్నుల నొత్తి
కలికిచూపులఁజూచి కరిఁగించితివి మతిఁ
బలిమి నీ కెంతగద్దో భావింత మిఁకను

(॥మొగ॥)
సారెకు నీమోవి చూపి చవులు రేఁచితివి
గోరు సోఁక బాదా లొత్తికూడితివి
యీరీతి శ్రీవేంకటేశుఁడిన్నిటాను నను నేలె
మేరమీర కెట్టుంటివో మెచ్చేము నిన్నును

(||pallavi||)
mŏgamāyalām̐ḍive mŏgani niṁta sesidi
sigure sām̐gayaidem̐ jĕppanem̐ṭigi

(||mŏga||)
maṁtanā lāḍiyāḍi marigiṁchugŏṁṭivi
sĕṁtam̐ juṭṭama vaidivi sevalu sesi
vaṁtalagu mŏkkimŏkki valabiṁchugŏṁṭivi
yĕṁta seyanuṁdānavo yisumaṁtadānavu

(||mŏga||)
sĕlavula navvu navvi sedigi lom̐jesugŏṁṭi
saligĕdāna vaidivi sannula nŏtti
kaligisūbulam̐jūsi karim̐giṁchidivi madim̐
balimi nī kĕṁtagaddo bhāviṁta mim̐kanu

(||mŏga||)
sārĕgu nīmovi sūbi savulu rem̐sidivi
goru som̐ka bādā lŏttigūḍidivi
yīrīdi śhrīveṁkaḍeśhum̐ḍinniḍānu nanu nelĕ
meramīra kĕṭṭuṁṭivo mĕchchemu ninnunu