Mogamaadadaana nenu modalane tanadonu

మొగమాటదాన నేను మొదలనే తనతోను
Language

(॥పల్లవి॥)
మొగమాటదాన నేను మొదలనే తనతోను
యెగసక్కేనకునైన యేకతము లేదా

(॥మొగ॥)
చిత్తములోపలిమాట చెప్పఁజాలకుండితేను
వొత్తువెట్టీ మానఁ డూరకైనాను
పొత్తుల నున్నది కీలు భోగించినవాఁడు తాను
ఇత్తలఁ దనకు గొంత యేకతము లేదా

(॥మొగ॥)
సిగ్గులు మీరిన చేఁత సేయఁ జాలకుండితేను
అగ్గలమై వెరిగించీ నందాఁకాను
వెగ్గళించె వలపులు వెఱపెఱఁగఁడు తాను
యెగ్గులు దీరుచుకోను యేకతము లేదా

(॥మొగ॥)
ననుపైన సుద్దులకు నవ్వఁజాలకుండితేను
చెనకి మొగము చూచి చిమ్మిరేఁచీని
అనుగు శ్రీ వేంకటేశుఁ డలమేలుమంగ నేను
యెనసె నిప్పుడు తన కేకతము లేదా

(||pallavi||)
mŏgamāḍadāna nenu mŏdalane tanadonu
yĕgasakkenagunaina yegadamu ledā

(||mŏga||)
sittamulobalimāḍa sĕppam̐jālaguṁḍidenu
vŏttuvĕṭṭī mānam̐ ḍūragainānu
pŏttula nunnadi kīlu bhogiṁchinavām̐ḍu tānu
ittalam̐ danagu gŏṁta yegadamu ledā

(||mŏga||)
siggulu mīrina sem̐ta seyam̐ jālaguṁḍidenu
aggalamai vĕrigiṁchī naṁdām̐kānu
vĕggaḽiṁchĕ valabulu vĕṟabĕṟam̐gam̐ḍu tānu
yĕggulu dīrusugonu yegadamu ledā

(||mŏga||)
nanubaina suddulagu navvam̐jālaguṁḍidenu
sĕnagi mŏgamu sūsi simmirem̐sīni
anugu śhrī veṁkaḍeśhum̐ ḍalamelumaṁga nenu
yĕnasĕ nippuḍu tana kegadamu ledā