(॥పల్లవి॥)
మొకదాకిరిదానను మొదల నేను
యెకసక్కెమాడనేర నేమి సేతునయ్యా
(॥మొక॥)
పొంచి నీవు నవ్వఁగాను బొమ్మల జంకించరాదు
కొంచక చెక్క నొక్కఁగా కోపించరాదు
మంచిమాఁటలాడఁగాను మలసి తిట్టఁగరాదు
యెంచరాని నీ చేఁతల కేమి సేతునయ్యా
(॥మొక॥)
ఇచ్చకము సేయఁగాను యెరవు సేసుకోరాదు
కొచ్చి నీవు పెనఁగఁగా గుంపించరాదు
మచ్చిక గాఁగిలించగఁగా మరి యలుగఁగరాదు
యెచ్చటనుండి వచ్చేవో యేమి సేతునయ్యా
(॥మొక॥)
పైకొని విడేమియ్యఁగా పరాకు సేసుకోరాదు
జోకతో వేఁడుకోఁగాను సొలయరాదు
నీకు నీవే శ్రీవేంకటనిలయ నన్నేలితివి
యీకడ నీసంతోసాన కేమి సేతునయ్యా
(||pallavi||)
mŏgadāgiridānanu mŏdala nenu
yĕgasakkĕmāḍanera nemi sedunayyā
(||mŏga||)
pŏṁchi nīvu navvam̐gānu bŏmmala jaṁkiṁcharādu
kŏṁchaga sĕkka nŏkkam̐gā kobiṁcharādu
maṁchimām̐ṭalāḍam̐gānu malasi tiṭṭam̐garādu
yĕṁcharāni nī sem̐tala kemi sedunayyā
(||mŏga||)
ichchagamu seyam̐gānu yĕravu sesugorādu
kŏchchi nīvu pĕnam̐gam̐gā guṁpiṁcharādu
machchiga gām̐giliṁchagam̐gā mari yalugam̐garādu
yĕchchaḍanuṁḍi vachchevo yemi sedunayyā
(||mŏga||)
paigŏni viḍemiyyam̐gā parāgu sesugorādu
jogado vem̐ḍugom̐gānu sŏlayarādu
nīgu nīve śhrīveṁkaḍanilaya nannelidivi
yīgaḍa nīsaṁtosāna kemi sedunayyā