(॥పల్లవి॥)
మొకదాకిరిదానను మొదల నేను
వెకలివైతివి యిట్టె వెలయవయ్యా
(॥మొక॥)
తేనెగారీ నీమాటల తేటలూరీ నీచూపులను
ఆనుకొని యేమనిఆడే నిన్ను
నానుపుఁజెమటలును ననలై నపులకలు
సోనల నీమేన నివె చూచుకోవయ్యా
(॥మొక॥)
రసముబ్బీ నవ్వులను రాసివడీ మొక్కులను
దొసకులేమని దూరే నిన్ను
పసిమి మోముకళలు బచ్చనమై గుఱుతులు
సుసరాన నీకునీవే చూచుకోవయ్యా
(॥మొక॥)
చిగిరించీ సిగ్గులను చిమ్మిరేఁగీవేడుకల
తగవుల సేమని తడవే నిన్ను
నిగిడిశ్రీవేంకటేశ నీవు నన్నుఁ గూడితివి
సొగసులు నీకునీవే చూచుకోవయ్యా
(||pallavi||)
mŏgadāgiridānanu mŏdala nenu
vĕgalivaidivi yiṭṭĕ vĕlayavayyā
(||mŏga||)
tenĕgārī nīmāḍala teḍalūrī nīsūbulanu
ānugŏni yemaniāḍe ninnu
nānubum̐jĕmaḍalunu nanalai nabulagalu
sonala nīmena nivĕ sūsugovayyā
(||mŏga||)
rasamubbī navvulanu rāsivaḍī mŏkkulanu
dŏsagulemani dūre ninnu
pasimi momugaḽalu bachchanamai guṟudulu
susarāna nīgunīve sūsugovayyā
(||mŏga||)
sigiriṁchī siggulanu simmirem̐gīveḍugala
tagavula semani taḍave ninnu
nigiḍiśhrīveṁkaḍeśha nīvu nannum̐ gūḍidivi
sŏgasulu nīgunīve sūsugovayyā