మొదలివారము నేము మోహమెపుడు గలదే
(॥పల్లవి॥)
మొదలివారము నేము మోహమెపుడు గలదే
మదమత్సరము లిఁక మాకేఁటికే
(॥మొద॥)
కొత్తపెండ్లికూఁతురవు కోరి వెంగేలాడఁ జెల్లు
వొత్తి నేమైతే నింతేసి కోపమమ్మా
హత్తిన వింతొకచూపు అందురు వేఁడొకచని
మత్తిలి నీ వోజలు మాకేఁటికే
(॥మొద॥)
యిగురు వలపులాన వేమైనఁ జేయఁజెల్లు
యెగసక్కే లింతేసి కెరఁగమమ్మా
చిగురు పాన్పు మెత్తన చెలఁగి ననలు వాఁడి
మగువ నీమతకాలు మాకేఁటికే
(॥మొద॥)
వేడుకకత్తెవు నీవు వేమారుఁ గూడఁజెల్లు
జాడతో వేసరించఁగఁ జాలమమ్మా
యీడుతో శ్రీ వేంకటేశుఁ డిద్దరి నొక్కటఁగూడె
మాడుపుటింటిలో సిగ్గు మాకేఁటికే
(||pallavi||)
mŏdalivāramu nemu mohamĕbuḍu galade
madamatsaramu lim̐ka māgem̐ṭige
(||mŏda||)
kŏttabĕṁḍligūm̐turavu kori vĕṁgelāḍam̐ jĕllu
vŏtti nemaide niṁtesi kobamammā
hattina viṁtŏgasūbu aṁduru vem̐ḍŏgasani
mattili nī vojalu māgem̐ṭige
(||mŏda||)
yiguru valabulāna vemainam̐ jeyam̐jĕllu
yĕgasakke liṁtesi kĕram̐gamammā
siguru pānpu mĕttana sĕlam̐gi nanalu vām̐ḍi
maguva nīmadagālu māgem̐ṭige
(||mŏda||)
veḍugagattĕvu nīvu vemārum̐ gūḍam̐jĕllu
jāḍado vesariṁcham̐gam̐ jālamammā
yīḍudo śhrī veṁkaḍeśhum̐ ḍiddari nŏkkaḍam̐gūḍĕ
māḍubuḍiṁṭilo siggu māgem̐ṭige