Modalane yeramgavaa mogi neebaadivaamdu

మొదలనె యెరఁగవా మొగి నీపాటివాఁడు
Language

(॥పల్లవి॥)
మొదలనె యెరఁగవా మొగి నీపాటివాఁడు
చెదరి చింతించఁబోతే సిగ్గుగాదా నాకు

(॥మొదల॥)
అలిగినవాఁడవు అట్టె వుండక నన్ను
పిలిచేవు చేయివట్టి పెనఁగేవు
యెలమినింతటివాఁడు యెంత దమకించీనంటా
చెలులెల్లనాడుకొంటే సిగ్గుగాదా నీకు

(॥మొదల॥)
వొట్టువెట్టుకొన్నవాఁడవు వున్నతిఁ జెల్లించుకోక
పట్టేవు నాకొంగు పచ్చిదేరను
పట్టిలేక నీవాడిన పంతము దప్పినాడంటే
చిట్టికపు కాంతలలో సిగ్గుగాదా నీకు

(॥మొదల॥)
ఆవలి మోమైనవాఁడ వలమేల్ మంగనంటా
శ్రీవెంకటేశ నన్నుఁ జేకొంటివిట్టే
భావమెరఁగక నిన్ను పరులెల్లా నవ్వితేను
సేవసేసేవారివద్ద సిగ్గుగాదా నీకు

(||pallavi||)
mŏdalanĕ yĕram̐gavā mŏgi nībāḍivām̐ḍu
sĕdari siṁtiṁcham̐bode siggugādā nāgu

(||mŏdala||)
aliginavām̐ḍavu aṭṭĕ vuṁḍaga nannu
pilisevu seyivaṭṭi pĕnam̐gevu
yĕlaminiṁtaḍivām̐ḍu yĕṁta damagiṁchīnaṁṭā
sĕlulĕllanāḍugŏṁṭe siggugādā nīgu

(||mŏdala||)
vŏṭṭuvĕṭṭugŏnnavām̐ḍavu vunnadim̐ jĕlliṁchugoga
paṭṭevu nāgŏṁgu pachchideranu
paṭṭilega nīvāḍina paṁtamu dappināḍaṁṭe
siṭṭigabu kāṁtalalo siggugādā nīgu

(||mŏdala||)
āvali momainavām̐ḍa valamel maṁganaṁṭā
śhrīvĕṁkaḍeśha nannum̐ jegŏṁṭiviṭṭe
bhāvamĕram̐gaga ninnu parulĕllā navvidenu
sevasesevārivadda siggugādā nīgu