Modalane yeejoga mosaboga

మొదలనే యీజోక మోసపోక
Language

(॥పల్లవి॥)
మొదలనే యీజోక మోసపోక
పొదలించవలెఁగాక పొద్దువోక

(॥మొద॥)
నెలంతకు నీకుఁ బోదు నేరమి యెందును లేదు
యెలమి మీఇద్దరిలో నేలవాదు
కలఁచి చూచె నింతే కంతునికిఁ బొద్దు వోదు
వలచినమీఁదఁ బాయ వసముగాదు

(॥మొద॥)
ఇంతలేని వొట్లేల ఇద్దరికి నీలీల
పొంతనే లేచినయట్టిపొద్దువేళ
వంతుల దెప్పల దేలవద్దు వద్దు మీవోల
కొంత గొంత పంతమిచ్చి కొసరనేల

(॥మొద॥)
యిన్నియు నింతటఁ దీరె యెన్నికలు చేకూరె
చెన్నుమీరెఁ గూరిములు సిగ్గులు జారె
వన్నెల శ్రీవేంకటేశ్వరునకు నీకు సారె
మన్ననకూటమిలోన మంతనాలు చేరె

(||pallavi||)
mŏdalane yījoga mosaboga
pŏdaliṁchavalĕm̐gāga pŏdduvoga

(||mŏda||)
nĕlaṁtagu nīgum̐ bodu nerami yĕṁdunu ledu
yĕlami mīiddarilo nelavādu
kalam̐si sūsĕ niṁte kaṁtunigim̐ bŏddu vodu
valasinamīm̐dam̐ bāya vasamugādu

(||mŏda||)
iṁtaleni vŏṭlela iddarigi nīlīla
pŏṁtane lesinayaṭṭibŏdduveḽa
vaṁtula dĕppala delavaddu vaddu mīvola
kŏṁta gŏṁta paṁtamichchi kŏsaranela

(||mŏda||)
yinniyu niṁtaḍam̐ dīrĕ yĕnnigalu segūrĕ
sĕnnumīrĕm̐ gūrimulu siggulu jārĕ
vannĕla śhrīveṁkaḍeśhvarunagu nīgu sārĕ
mannanagūḍamilona maṁtanālu serĕ