మొదలనే యెచ్చరికెతో మోసపోక యేపొద్దూ
(॥పల్లవి॥)
మొదలనే యెచ్చరికెతో మోసపోక యేపొద్దూ
వెదకి హరికథలే వినుచుండవలయు
(॥మొద॥)
వెలఁదుల సుద్దులు వీనులను వింటేను
పెలుచుఁజూపులఁ జూడఁ బ్రేమ వుట్టించు
మలసి యాచూపులు మనసునఁ దగిలించు
తలఁపు మాటాలాడఁ దమిరేఁచును
(॥మొద॥)
మగువలతోడుత మాటలాడ దొరకొంటే
నగినగి సంసారాలనంటు గల్పించు
తగిలిన నవ్వులు తనువులు సోఁకింపించు
మిగులాఁ దనుసోకులే మించి వలపించును
(॥మొద॥)
సతులతో మోహము సంపదలు పోరించు
అతిసంపదలు దేహి నజ్ఞానిఁ జేయు
తతి నలమేలుమంగపతి శ్రీవేంకటేశుఁడే
గతియని కొలిచితే ఘనునిఁగా జేయును
(||pallavi||)
mŏdalane yĕchcharigĕdo mosaboga yebŏddū
vĕdagi harigathale vinusuṁḍavalayu
(||mŏda||)
vĕlam̐dula suddulu vīnulanu viṁṭenu
pĕlusum̐jūbulam̐ jūḍam̐ brema vuṭṭiṁchu
malasi yāsūbulu manasunam̐ dagiliṁchu
talam̐pu māḍālāḍam̐ damirem̐sunu
(||mŏda||)
maguvaladoḍuda māḍalāḍa dŏragŏṁṭe
naginagi saṁsārālanaṁṭu galbiṁchu
tagilina navvulu tanuvulu som̐kiṁpiṁchu
migulām̐ danusogule miṁchi valabiṁchunu
(||mŏda||)
sadulado mohamu saṁpadalu poriṁchu
adisaṁpadalu dehi najñānim̐ jeyu
tadi nalamelumaṁgabadi śhrīveṁkaḍeśhum̐ḍe
gadiyani kŏliside ghanunim̐gā jeyunu