మొదలనే యాతనికి మోహపు దేవులవు
(॥పల్లవి॥)
మొదలనే యాతనికి మోహపు దేవులవు
వదలక ఇచ్చలోనే వచ్చి చొక్కించరాదా
(॥మొద॥)
తప్పులెంచనే లతనిఁ దగిలి వేఁడుకోనేల
వొప్పుగా నోరుపుతోడ నుండఁగరాదా
అప్పటి జంకించనేల ఆసలు కొలుపనేల
చెప్పి చూపి కూరిములే చెల్లించఁగరాదా
(॥మొద॥)
పెనఁగనేల ఆనలువెట్టి పిలువఁగనేల
ననుపున విభునితో నవ్వఁగరాదా
మొనగోర నూఁదనేల మొక్కులు మొక్కఁగనేల
యెనసి చెప్పినట్టల్లా నియ్యకొనరాదా
(॥మొద॥)
చేరి చెనకఁగనేల సిగ్గులు వడఁగనేల
మేరతోఁ గాఁగిటఁ గూడి మెప్పించరాదా
యీరీతి శ్రీవేంకటేశుఁ డిచ్చగించి నిన్ను నేలె
సారెకు నీమోవి యిట్టె చవి చూపరాదా
(||pallavi||)
mŏdalane yādanigi mohabu devulavu
vadalaga ichchalone vachchi sŏkkiṁcharādā
(||mŏda||)
tappulĕṁchane ladanim̐ dagili vem̐ḍugonela
vŏppugā norubudoḍa nuṁḍam̐garādā
appaḍi jaṁkiṁchanela āsalu kŏlubanela
sĕppi sūbi kūrimule sĕlliṁcham̐garādā
(||mŏda||)
pĕnam̐ganela ānaluvĕṭṭi piluvam̐ganela
nanubuna vibhunido navvam̐garādā
mŏnagora nūm̐danela mŏkkulu mŏkkam̐ganela
yĕnasi sĕppinaṭṭallā niyyagŏnarādā
(||mŏda||)
seri sĕnagam̐ganela siggulu vaḍam̐ganela
meradom̐ gām̐giḍam̐ gūḍi mĕppiṁcharādā
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍichchagiṁchi ninnu nelĕ
sārĕgu nīmovi yiṭṭĕ savi sūbarādā