మొదలనే నేనైతే మొకదాకిరి దానవు
(॥పల్లవి॥)
మొదలనే నేనైతే మొకదాకిరి దానవు
యెదురాడఁ జాల నిఁక నేమందునే
(॥మొద॥)
మంతనానఁ జుట్టి చుట్టి మాఁటలెల్లాఁ జెల్లఁబెట్టీ
నంతేసి గురుతులు మై నట్టె వుండఁగా
వింత వాసనలతోనే వేమారు వేఁడుకొనీని
యెంతనేరుపరి యీతఁ డేమందునే
(॥మొద॥)
సేసిన చేఁతలకెల్లాఁ జెల్లఁబో నెపాలు చూపి
లాసీ చిరునవ్వులు సెలవిఁ దేరఁగా
సేసపాలు రాలఁగానే చెప్పరాని బాస లిచ్చీ
యీ సుద్దులవటరతో నేమందునే
(॥మొద॥)
కానవచ్చిన పొందులు గంపఁగమ్మి పొసఁగించీ
ఆనుకొని తనచుట్టా లండ నుండఁగానే
పూని శ్రీ వేంకటేశుఁ డా పొందుతోనే నన్నుఁ గూడె
యీనాఁటకపు విభుని నేమందునే
(||pallavi||)
mŏdalane nenaide mŏgadāgiri dānavu
yĕdurāḍam̐ jāla nim̐ka nemaṁdune
(||mŏda||)
maṁtanānam̐ juṭṭi suṭṭi mām̐ṭalĕllām̐ jĕllam̐bĕṭṭī
naṁtesi gurudulu mai naṭṭĕ vuṁḍam̐gā
viṁta vāsanaladone vemāru vem̐ḍugŏnīni
yĕṁtanerubari yīdam̐ ḍemaṁdune
(||mŏda||)
sesina sem̐talagĕllām̐ jĕllam̐bo nĕbālu sūbi
lāsī sirunavvulu sĕlavim̐ deram̐gā
sesabālu rālam̐gāne sĕpparāni bāsa lichchī
yī suddulavaḍarado nemaṁdune
(||mŏda||)
kānavachchina pŏṁdulu gaṁpam̐gammi pŏsam̐giṁchī
ānugŏni tanasuṭṭā laṁḍa nuṁḍam̐gāne
pūni śhrī veṁkaḍeśhum̐ ḍā pŏṁdudone nannum̐ gūḍĕ
yīnām̐ṭagabu vibhuni nemaṁdune