Modalane maadom jeppina mokke mide neegu

మొదలనే మాతోఁ జెప్పిన మొక్కే మిదె నీకు
Language

(॥పల్లవి॥)
మొదలనే మాతోఁ జెప్పిన మొక్కే మిదె నీకు
మదనుని నిటు వాకట్టే మంత్రం బిఁక నేదో

(॥మొదల॥)
చెలియకు చిత్తరువ్రాఁతలు సిగ్గులలోపలి యీఁతలు
నిలువుకు నిలువే వెఱగులు నీకతమునఁ గలిగె
సెలవుల నవ్వులు యింతికి చిందగ మామతివెఱవులు
తెలుపఁగ నేరిచి కాచిన దేవర యెవ్వరొకో

(॥మొదల॥)
కన్నులచేవలు దేరెను కాఁకలు చన్నులు మీఱెను
నిన్నటనుండియు సతికిని నీకతమున నిదివో
అన్నువ ముచ్చటమాటలు ఆడఁగ బిలిచే నేమిఁక
మన్ననతో విని యడిపెను మందిక నెట్టిదొకో

(॥మొదల॥)
వలపులు శిరసుకు నెక్కెను వావులు పాదము దొక్కెను
నిలువున శ్రీవేంకపటతి నీ విటు గూడఁగను
కలసి మెలంగితి విటు మా కన్నులయెదుటనెయీసతి
చలములు సాదించిన యీ జాణవు నీవె యొకో

(||pallavi||)
mŏdalane mādom̐ jĕppina mŏkke midĕ nīgu
madanuni niḍu vāgaṭṭe maṁtraṁ bim̐ka nedo

(||mŏdala||)
sĕliyagu sittaruvrām̐talu siggulalobali yīm̐talu
niluvugu niluve vĕṟagulu nīgadamunam̐ galigĕ
sĕlavula navvulu yiṁtigi siṁdaga māmadivĕṟavulu
tĕlubam̐ga nerisi kāsina devara yĕvvarŏgo

(||mŏdala||)
kannulasevalu derĕnu kām̐kalu sannulu mīṟĕnu
ninnaḍanuṁḍiyu sadigini nīgadamuna nidivo
annuva muchchaḍamāḍalu āḍam̐ga bilise nemim̐ka
mannanado vini yaḍibĕnu maṁdiga nĕṭṭidŏgo

(||mŏdala||)
valabulu śhirasugu nĕkkĕnu vāvulu pādamu dŏkkĕnu
niluvuna śhrīveṁkabaḍadi nī viḍu gūḍam̐ganu
kalasi mĕlaṁgidi viḍu mā kannulayĕduḍanĕyīsadi
salamulu sādiṁchina yī jāṇavu nīvĕ yŏgo