Modala ninnum jooside mogavetamu ganamu

మొదల నిన్నుఁ జూచితే మొగవెూటము గనము
Language

(॥పల్లవి॥)
మొదల నిన్నుఁ జూచితే మొగవెూటము గనము
యెదరు గుదురుగా నిన్నేమి సేతుమయ్యా

(॥॥)
కొంచక నీవు సేసేవి గొప్పగొప్ప చేఁతలు
మంచిమాట లాడేవు మాతో నైతే
పొంచి చెవులారా వింటే పొసఁగ నీప్రియాలు
యెంచారావు పంచారావు యేమి సేతుమయ్యా

(॥॥)
యెక్కడ నైనా నీచల మెంతవలసినాఁ గద్దు
పక్కన నవ్వేవు మాతో పలుమారును
యిక్కడనే కంటిమి నీయిచ్చలు కోటికొండలు
యెక్కారావు దిగారావు యేమి సేతుమయ్యా

(॥॥)
హత్తిననీదేవుళ్ళు అంతటా నిండి వున్నారు
గుత్తముగా నాకాఁగిటఁ గూడితి విందు
నిత్తెము శ్రీవేంకటేశ నీవలపు మోపులాయ
యోత్తారావు దించారావు యేమి సేతుమయ్యా

(||pallavi||)
mŏdala ninnum̐ jūside mŏgavĕూṭamu ganamu
yĕdaru gudurugā ninnemi sedumayyā

(||||)
kŏṁchaga nīvu sesevi gŏppagŏppa sem̐talu
maṁchimāḍa lāḍevu mādo naide
pŏṁchi sĕvulārā viṁṭe pŏsam̐ga nīpriyālu
yĕṁchārāvu paṁchārāvu yemi sedumayyā

(||||)
yĕkkaḍa nainā nīsala mĕṁtavalasinām̐ gaddu
pakkana navvevu mādo palumārunu
yikkaḍane kaṁṭimi nīyichchalu koḍigŏṁḍalu
yĕkkārāvu digārāvu yemi sedumayyā

(||||)
hattinanīdevuḽḽu aṁtaḍā niṁḍi vunnāru
guttamugā nāgām̐giḍam̐ gūḍidi viṁdu
nittĕmu śhrīveṁkaḍeśha nīvalabu mobulāya
yottārāvu diṁchārāvu yemi sedumayyā