Modala nenaidenu mogadaagiridaananu

మొదల నేనైతేను మొకదాకిరిదానను
Language

(॥పల్లవి॥)
మొదల నేనైతేను మొకదాకిరిదానను
చెదరక తన బత్తి చేకొంటి ననరే

(॥మొద॥)
యిచ్చకము లాడఁగాను యెగసక్కే లాడరాదు
కచ్చుపెట్టి మొక్కిఁగాక కాదనరాదు
మచ్చికలు చూపఁగాను మచ్చరము సేయరాదు
యెచ్చట నున్నాఁడు విభుఁ డేమి సేతునే

(॥మొద॥)
చుట్టరికము సేయఁగా సూడువట్టఁగరాదు
అట్టె యీడు రాఁగా వద్దనఁగరాదు
నెట్టుక బాససేయఁగా నేరమిచేయఁగరాదు
యెట్టూ ననరాదు నవ్వీ నేమి సేతువే

(॥మొద॥)
పైకొనికాఁగిలించఁగా సంతయే లాడఁగరాదు
ఆకుమడిచిమ్మనఁగా నలయరాదు
యీకడ శ్రీవేంకటేశుఁడేలెనన్ను నింతలోనె
యేకమాయ వలపులు యేమిసేతునే

(||pallavi||)
mŏdala nenaidenu mŏgadāgiridānanu
sĕdaraga tana batti segŏṁṭi nanare

(||mŏda||)
yichchagamu lāḍam̐gānu yĕgasakke lāḍarādu
kachchubĕṭṭi mŏkkim̐gāga kādanarādu
machchigalu sūbam̐gānu machcharamu seyarādu
yĕchchaḍa nunnām̐ḍu vibhum̐ ḍemi sedune

(||mŏda||)
suṭṭarigamu seyam̐gā sūḍuvaṭṭam̐garādu
aṭṭĕ yīḍu rām̐gā vaddanam̐garādu
nĕṭṭuga bāsaseyam̐gā neramiseyam̐garādu
yĕṭṭū nanarādu navvī nemi seduve

(||mŏda||)
paigŏnigām̐giliṁcham̐gā saṁtaye lāḍam̐garādu
āgumaḍisimmanam̐gā nalayarādu
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ḍelĕnannu niṁtalonĕ
yegamāya valabulu yemisedune