(॥పల్లవి॥)
మొదల నేఁటికే మోసములూ
కొదలుచు(?) నైనా గొణఁగుదు గానీ
(॥॥)
వూరకయైనా నూఁ కొనరాదా
చేరి విభుఁడు కత చెప్పినదే
ఆరయ నీ కోప మంతె కలిగితే
బీరపు రతులలో పెంతువు గానీ
(॥॥)
మొగ మోటనైన మొక్కఁగ రాదా
సొగిసి నిన్నతఁడు చూచినదే
తెగువ నీ మతిని తిరముగఁ గలిగితే
చిగురు మోవులలోఁ జిలుకుదు గానీ
(॥॥)
ననుపు సేసుకొని నవ్వఁగ రాదా
ఘనుఁడు పచ్చడము గప్పినదే
యెనసెను శ్రీవేంకటేశుఁ డితఁడు నిను
కినిసి సరసములఁ గెరలుదు గానీ.
(||pallavi||)
mŏdala nem̐ṭige mosamulū
kŏdalusu(?) nainā gŏṇam̐gudu gānī
(||||)
vūragayainā nūm̐ kŏnarādā
seri vibhum̐ḍu kada sĕppinade
āraya nī koba maṁtĕ kaligide
bīrabu radulalo pĕṁtuvu gānī
(||||)
mŏga moḍanaina mŏkkam̐ga rādā
sŏgisi ninnadam̐ḍu sūsinade
tĕguva nī madini tiramugam̐ galigide
siguru movulalom̐ jilugudu gānī
(||||)
nanubu sesugŏni navvam̐ga rādā
ghanum̐ḍu pachchaḍamu gappinade
yĕnasĕnu śhrīveṁkaḍeśhum̐ ḍidam̐ḍu ninu
kinisi sarasamulam̐ gĕraludu gānī.