Modala nemi neṟamgadaaya mumchina demta paravashambo

మొదల నేమి నెఱఁగదాయ ముంచిన దెంత పరవశంబో
Language

(॥పల్లవి॥)
మొదల నేమి నెఱఁగదాయ ముంచిన దెంత పరవశంబో
కదిసినప్పటి చేఁతలు విభునిఁ గనుచు విభుని దూరెను

(॥॥)
ఇంతి మోము గడుగఁ బోయి యెలమి దోసిట నీరు నించి
అంతట మోవి కెంపుల నీడ యందుఁ చూచి నవ్వెను
రంతు సేసి ముంజేతి చిలుక రతి పలుక లప్పుడు నుడుగ
అంతలోనే పంజరమున నదిమి శిరసు వంచెను

(॥॥)
నెలఁత సొమ్ములు వెట్టఁగఁబోయ నిలువుటద్దములోన మదన-
కళలు చెదరుఁగురులు చూచి గక్కున సిగ్గున మునిఁగెను
చెలులమీఁదఁ జేయివేసి చేతనున్న విభునివేలి-
అలరుముద్దుటుంగరంబు అపుడు చూచి భ్రమసెను

(॥॥)
పానుపుమీఁదఁ బవ్వళించ పడఁతి యేగి యుందుమీఁద
తానకమైనవిభునిఁ జూచి దగ్గరి కాఁగిలించెను
అనిన శ్రీ వేంకటేశుఁ డంతటిజాణ గనక కలసి
మోనముతోడఁ జొక్కిచొక్కి మున్నిటివెల్ల వడిగెను

(||pallavi||)
mŏdala nemi nĕṟam̐gadāya muṁchina dĕṁta paravaśhaṁbo
kadisinappaḍi sem̐talu vibhunim̐ ganusu vibhuni dūrĕnu

(||||)
iṁti momu gaḍugam̐ boyi yĕlami dosiḍa nīru niṁchi
aṁtaḍa movi kĕṁpula nīḍa yaṁdum̐ sūsi navvĕnu
raṁtu sesi muṁjedi siluga radi paluga lappuḍu nuḍuga
aṁtalone paṁjaramuna nadimi śhirasu vaṁchĕnu

(||||)
nĕlam̐ta sŏmmulu vĕṭṭam̐gam̐boya niluvuḍaddamulona madana-
kaḽalu sĕdarum̐gurulu sūsi gakkuna sigguna munim̐gĕnu
sĕlulamīm̐dam̐ jeyivesi sedanunna vibhuniveli-
alarumudduḍuṁgaraṁbu abuḍu sūsi bhramasĕnu

(||||)
pānubumīm̐dam̐ bavvaḽiṁcha paḍam̐ti yegi yuṁdumīm̐da
tānagamainavibhunim̐ jūsi daggari kām̐giliṁchĕnu
anina śhrī veṁkaḍeśhum̐ ḍaṁtaḍijāṇa ganaga kalasi
monamudoḍam̐ jŏkkisŏkki munniḍivĕlla vaḍigĕnu