Modala nemee neramga moodhuraalanu

మొదల నేమీ నెరఁగ మూఢురాలను
Language

(॥పల్లవి॥)
మొదల నేమీ నెరఁగ మూఢురాలను
యెదుట నీ యాల నేను యీడేరించ వయ్యా

(॥మొదల॥)
వోపి మంచము దిగక వుందు నొక్కక్కవేళను
రాపుగ నిన్నుఁ బొందిన రాజసానను
కోపగింతు నొకవేళఁ గొసరుదు నొకవేళ
ఆపాపము లే దని మా కానతియ్య వయ్యా

(॥మొదల॥)
దగ్గరినవేళ నాపాదము దాఁకు నీ మేను
అగ్గలపుమందెవేళ మట్టె కాఁగాను
వెగ్గళింతు నొకవేళ వేసిరింతు నొకవేళ
యెగ్గు లే దని వరము లియ్య వయ్యా

(॥మొదల॥)
యేకతపువేళ నిన్ను యే మైనా నందుము నేము
కైకొని చనవుతోడఁ గాఁగిట నించి
యీకడ శ్రీవెంకటేశ యేక మైతి మిద్దరము
వాకుదోసము లే దని వల లీవయ్యా

(||pallavi||)
mŏdala nemī nĕram̐ga mūḍhurālanu
yĕduḍa nī yāla nenu yīḍeriṁcha vayyā

(||mŏdala||)
vobi maṁchamu digaga vuṁdu nŏkkakkaveḽanu
rābuga ninnum̐ bŏṁdina rājasānanu
kobagiṁtu nŏgaveḽam̐ gŏsarudu nŏgaveḽa
ābābamu le dani mā kānadiyya vayyā

(||mŏdala||)
daggarinaveḽa nābādamu dām̐ku nī menu
aggalabumaṁdĕveḽa maṭṭĕ kām̐gānu
vĕggaḽiṁtu nŏgaveḽa vesiriṁtu nŏgaveḽa
yĕggu le dani varamu liyya vayyā

(||mŏdala||)
yegadabuveḽa ninnu ye mainā naṁdumu nemu
kaigŏni sanavudoḍam̐ gām̐giḍa niṁchi
yīgaḍa śhrīvĕṁkaḍeśha yega maidi middaramu
vāgudosamu le dani vala līvayyā