మోపు మోయనే కాని మూలుగఁగఁ బొద్దు లేదు
(॥పల్లవి॥)
మోపు మోయనే కాని మూలుగఁగఁ బొద్దు లేదు
శ్రీపతి మాపాటు లివి చిత్తగించవయ్యా
(॥మోపు॥)
మన సెంతైనాఁ గద్దు మాయలెల్లఁ జింతించ
చొనిపి విరక్తి కైతే చోటు లేదు
తను వెంతైనాఁ గద్దు దప్పికి నాఁకటికిని
యెనసి విజ్ఞానమున కెడ లేదు
(॥మోపు॥)
నాలి కెంతైనాఁ గద్దు నాండ్ల సుద్దులు చెప్ప
తాలిమి గోవిందా యన తావు లేదు
కాల మెంతైనాఁ గద్దు కర్మములే పచరించ
వేళమె సంకిర్తనకు వేళ లేదు
(॥మోపు॥)
బలి మెంతైనాఁ గద్దు షాపములు సేయఁగా
చలపట్టి పుణ్యాలకు సత్వ లేదు
యెలమి శ్రీ వేంకటేశ యిదిగో నీ మాయ నీ వే
తెలిపినప్పుడే కాని తెగువ లేదు
(||pallavi||)
mobu moyane kāni mūlugam̐gam̐ bŏddu ledu
śhrībadi mābāḍu livi sittagiṁchavayyā
(||mobu||)
mana sĕṁtainām̐ gaddu māyalĕllam̐ jiṁtiṁcha
sŏnibi virakti kaide soḍu ledu
tanu vĕṁtainām̐ gaddu dappigi nām̐kaḍigini
yĕnasi vijñānamuna kĕḍa ledu
(||mobu||)
nāli kĕṁtainām̐ gaddu nāṁḍla suddulu sĕppa
tālimi goviṁdā yana tāvu ledu
kāla mĕṁtainām̐ gaddu karmamule pasariṁcha
veḽamĕ saṁkirdanagu veḽa ledu
(||mobu||)
bali mĕṁtainām̐ gaddu ṣhābamulu seyam̐gā
salabaṭṭi puṇyālagu satva ledu
yĕlami śhrī veṁkaḍeśha yidigo nī māya nī ve
tĕlibinappuḍe kāni tĕguva ledu