Minnu nela mose nade medidaivamu

మిన్ను నేల మోచె నదె మేటిదైవము
Language

(॥పల్లవి॥)
మిన్ను నేల మోచె నదె మేటిదైవము
కన్నులెదుటనే శ్రీవేంకటరాయఁడు

(॥మిన్ను॥)
యెత్తినాఁడు గోవర్ధన మింద్రాదిసురలెదుట
వొత్తినాఁడు శంఖము దైత్యుల గెలిచి
మెత్తినాఁడు హిరణ్యుని మెదడు చందనముగా
మెత్తినాఁడు మల్లులను మొగ తిరుగఁగను

(॥మిన్ను॥)
పట్టినాఁడు చక్రము వుబ్బరి కాలనేమిమీఁద
మెట్టినాఁడు కాళింగుని మెడలమీఁద
వెట్టినాఁడు యేకదాడి పెనుసముద్రదాఁట
కొట్టినాఁడు పౌండ్రకుని కోలాహలముగా

(॥మిన్ను॥)
తుంచినాఁడు సోమకుని తోయములు చొచ్చిచొచ్చి
దంచినాఁడు జరాంధు దండిపవుఁజుల
యెంచఁగ శ్రీ వేంకటాద్రి నిందిరయుఁ దానుఁ గూడి
మించినాఁడు దాసులను మెచ్చి వరములను

(||pallavi||)
minnu nela mosĕ nadĕ meḍidaivamu
kannulĕduḍane śhrīveṁkaḍarāyam̐ḍu

(||minnu||)
yĕttinām̐ḍu govardhana miṁdrādisuralĕduḍa
vŏttinām̐ḍu śhaṁkhamu daityula gĕlisi
mĕttinām̐ḍu hiraṇyuni mĕdaḍu saṁdanamugā
mĕttinām̐ḍu mallulanu mŏga tirugam̐ganu

(||minnu||)
paṭṭinām̐ḍu sakramu vubbari kālanemimīm̐da
mĕṭṭinām̐ḍu kāḽiṁguni mĕḍalamīm̐da
vĕṭṭinām̐ḍu yegadāḍi pĕnusamudradām̐ṭa
kŏṭṭinām̐ḍu pauṁḍraguni kolāhalamugā

(||minnu||)
tuṁchinām̐ḍu somaguni toyamulu sŏchchisŏchchi
daṁchinām̐ḍu jarāṁdhu daṁḍibavum̐jula
yĕṁcham̐ga śhrī veṁkaḍādri niṁdirayum̐ dānum̐ gūḍi
miṁchinām̐ḍu dāsulanu mĕchchi varamulanu